Delhi : ‘సులభ్’ కాంప్లెక్స్‌ల వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ గుండెపోటుతో మృతి

'సులభ్' వ్యవస్థాపకులు బిందేశ్వర్ పాఠక్ గుండెపోటుతో మరణించారు. ఈ సంస్థ ద్వారా అనేక కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణానికి విశేష కృషి చేసారాయన. పాఠక్ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు.

Delhi : ‘సులభ్’ కాంప్లెక్స్‌ల వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ గుండెపోటుతో మృతి

Delhi

Updated On : August 15, 2023 / 6:39 PM IST

Delhi : దేశంలో పెద్ద ఎత్తున పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి కృషి చేసిన ‘సులభ్’ వ్యవస్థాపకులు బిందేశ్వర్ పాఠక్ గుండెపోటుతో మరణించారు. ఆయన వయసులో 80 సంవత్సరాలు. ఆగస్టు 15 వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ జెండా ఎగురవేసి వెంటనే కుప్పకూలిపోయారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ బిందేశ్వర్ తుది శ్వాస విడిచారు.

Smriti Irani : స్త్రీలలో రుతుస్రావం.. పరిశుభ్రత గురించి ఎందుకు మాట్లాడకూడదు?.. స్మృతి ఇరానీ యాడ్ వైరల్

బిందేశ్వర్ పాఠక్ బీహార్‌లోని వైశాలి జిల్లా రామ్‌పూర్ బాఘేల్ గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తల్లి యోగమాయా దేవి..తండ్రి రమాకాంత్ పాఠక్. పాఠక్ 1964 లో బనారస్ యూనివర్సిటీ నుంచి సోషియాలజీలో డిగ్రీ చేశారు. సోషియాలజీలో పట్టా పుచ్చున్న తరువాత గాంధీ శత జయంతి కమిటీలో వాలంటీర్‌గా చేరడానికి ముందు కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1980 లో మాస్టర్స్, 1985 లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. రచయితగా ‘ది రోడ్ టు ఫ్రీడం’ వంటి అనేక పుస్తకాలు రాసారు. సులభ్ ఇంటర్నేషనల్ సంస్థకు ప్రస్తుతం 50 వేల మంది వాలంటీర్లు ఉన్నారు. దేశంలోనే అతి పెద్ద నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌గా ఈ సంస్థకు గుర్తింపు ఉంది.

Personal Hygiene : వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో చాలా మంది పురుషులు తెలియకుండా చేసే 6 తప్పులు ఇవే !

బహిరంగ మలమూత్ర విసర్జనకు వ్యతిరేకంగా పోరాడుతూ పాఠక్ సులభ్ ఇంటర్నేషనల్ సంస్థను స్ధాపించారు. ఈ సంస్థ ద్వారా అనేక కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణానికి విశేష కృషి చేసారాయన. ఆయన చేసిన సేవలకు గానూ భారత ప్రభుత్వం 1990 లో పద్మభూషణ్‌తో సత్కరించింది. పాఠక్ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. “డాక్టర్ బిందేశ్వర్ పాఠక్ జీ మరణించడం మన దేశానికి తీరని లోటు. ఆయన సమాజ పురోగమనం మరియు అణగారిన వర్గాల సాధికారత కోసం విస్తృతంగా కృషి చేసిన దార్శనికుడు” అని మోడీ ట్వీట్ చేశారు.