Horoscope Today : రాహు నక్షత్రంపై చంద్రుడు.. వాళ్ళను కకావికలం చేస్తాడు.. ఈరోజు ఈ మూడు రాశుల వారు జాగ్రత్త..!
రావలసిన డబ్బు దోబూచులాడుతుంది. సంయమనంతో పనులు చేయడం అవసరం. ఉద్యోగులకు మిశ్రమ వాతావరణం. ఒత్తిళ్లు అధికం అవుతాయి.

Today Horoscope
Horoscope Today : క్షీణ చంద్రుడు పలు రాశులను పరీక్షిస్తాడు. రాహు నక్షత్రంపై సంచరిస్తున్న చంద్రుడు.. శని, రవి రాశులను కాస్త కకావికలం చేస్తాడు. మేషం, కర్కాటకం, వృశ్చిక రాశుల వారిపై కరుణ చూపుతాడు. మొత్తంగా ఈ రోజు.. సింహం, మకరం, కుంభ రాశుల వారు కాస్త జాగ్రత్తగా ఉండటం అవసరం.

Aries
మేషం: ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. స్థిర, చరాస్తుల మూలంగా ఆదాయం కలిసి వస్తుంది. సుబ్రహ్మణ్యస్వామి స్తోత్రాలు పఠించండి.

Taurus
వృషభం: వ్యాపారులకు మంచి సమయం. ఉద్యోగులకు పదోన్నతి, అనుకూల స్థానచలన సూచన. బంధుమిత్రుల రాకతో ఇంట్లో సందడిగా ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. రామాలయాన్ని సందర్శించండి.

Gemini
మిథునం: రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తిపరంగా సంతృప్తిగా ఉంటారు. అన్నదమ్ములతో అభిప్రాయ భేదాలు రావచ్చు. అనవసరమైన చర్చల్లో తలదూర్చకండి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తారు. శివారాధన మేలు చేస్తుంది.

Cancer
కర్కాటకం: ఆత్మీయుల సహకారం లభిస్తుంది. శుభకార్యాలకు హాజరవుతారు. వాహనం, భూమి కొనుగోలు చేస్తారు. ఆత్మవిశ్వాసంతో పనులు చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. నలుగురిలో గుర్తింపు పొందుతారు. వినాయకుడి ఆలయాన్ని సందర్శించండి.

Leo
సింహం: భూ వ్యవహారంలో చికాకులు ఉంటాయి. ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. వ్యాపార భాగస్వాములతో వాదోపవాదాలు జరుగుతాయి. రాజకీయ ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. సమయపాలన అవసరం. ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

Virgo
కన్య: తలపెట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. కొత్త వ్యక్తుల పరిచయాలతో కార్యసాఫల్యం ఉంటుంది. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. ఆస్తి తగాదాలు సమసిపోతాయి. వ్యాపార లావాదేవీలు కలిసివస్తాయి. భోజన సౌఖ్యం ఉంది. లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.

Libra
తుల: ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. భూ వ్యవహారం లాభిస్తుంది. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. ఆత్మీయుల సహకారాన్ని పొందుతారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. నరసింహస్వామి ఆలయాన్ని దర్శించండి.

Scorpio
వృశ్చికం: ఆర్థికంగా లబ్ధి పొందుతారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. బంధువర్గంతో కార్యసాఫల్యం ఉంది. విద్యార్థులకు అనుకూలం. మంచి సంస్థలలో చేరే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగులు అధికారుల ప్రశంసలు అందుకుంటారు. శివాలయాన్ని సందర్శించండి.

Sagittarisu
ధనుస్సు: విద్యార్థులకు అనుకూలం. ఉద్యోగులకు మంచి సమయం. అన్నదమ్ములు, బంధువులతో కార్యసాఫల్యం ఉంటుంది. ఆత్మీయుల తోడ్పాటు లభిస్తుంది. భూతగాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబ పెద్ద ఆరోగ్యం కలవరపెడుతుంది. ఇష్టదైవాన్ని ప్రార్థించండి.

Capricorn
మకరం: రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపార లావాదేవీల్లో చికాకులు తలెత్తుతాయి. మంచికి పోతే చెడు ఎదురవుతుంది. నిందలు పడాల్సి వస్తుంది. విలువైన వస్తువుల విషయంలో ఏమరుపాటు తగదు. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.

Aquarius
కుంభం: రావలసిన డబ్బు దోబూచులాడుతుంది. సంయమనంతో పనులు చేయడం అవసరం. ఉద్యోగులకు మిశ్రమ వాతావరణం. ఒత్తిళ్లు అధికం అవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. రాజకీయ, ప్రభుత్వ, కోర్టు పనుల్లో కార్యసాఫల్యత తక్కువ. శివారాధన శుభప్రదం.

Pisces
మీనం: వాహనం కొనుగోలు చేస్తారు. నలుగురికి సాయపడతారు. సేవాభావంతో ఉంటారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపారం సంతృప్తికరంగా కొనసాగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. గణపతి గుడిని సందర్శించండి.
(వ్యక్తిగత జాతక వివరాల కోసం సంప్రదించగలరు)
టి. భుజంగరామ శర్మ
77022 86008
Disclaimer : జ్యోతిష్యం అనేది పూర్తి వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. నిరూపితమైన శాస్త్రం కాదు. ఈ వెబ్‌సైట్‌లోని కంటెంట్ సమాచారం కోసం మాత్రమే. ఇందులో కచ్చితత్వానికి హామీ ఇవ్వలేం. ఈ కంటెంట్ ఆధారంగా తీసుకునే ఏవైనా నిర్ణయాలపై మీదే బాధ్యత. వ్యక్తిగత, ఆర్థిక, వైద్య లేదా చట్టపరమైన విషయాల గురించి పూర్తి సమాచారం కోసం అర్హత కలిగిన నిపుణులను సంప్రదించండి. ఈ కంటెంట్ ద్వారా వల్ల కలిగే ఎలాంటి ఫలితాలకు మాది బాధ్యత కాదని గమనించాలి.