Viral Video: నిమిషంలో 55 కొవ్వొత్తులను ఆర్పి గిన్నిస్ రికార్డులకెక్కిన వ్యక్తి
ఒక్క నిమిషంలో 55 కొవ్వొత్తులను ఆర్పి గిన్నిస్ బుక్ రికార్డులకెక్కాడు ఓ వ్యక్తి. ఇందులో వరుసగా కొవ్వొత్తులు పెడతారు. వాటి మీదుగా జంప్ చేస్తూ ఆ సమయంలో రెండు పాదాలను తాకిస్తూ ఆ గాలికి కొవ్వొత్తులను ఆర్పేయాలి. ట్యూడర్ ఫిలిప్స్ అనే వ్యక్తి ఒక్క నిమిషంలో అత్యధిక కొవ్వొత్తులను ఆర్పేశాడు.

Viral Video
Viral Video: ఒక్క నిమిషంలో 55 కొవ్వొత్తులను ఆర్పి గిన్నిస్ బుక్ రికార్డులకెక్కాడు ఓ వ్యక్తి. ఇందులో వరుసగా కొవ్వొత్తులు పెడతారు. వాటి మీదుగా జంప్ చేస్తూ ఆ సమయంలో రెండు పాదాలను తాకిస్తూ ఆ గాలికి కొవ్వొత్తులను ఆర్పేయాలి. ట్యూడర్ ఫిలిప్స్ అనే వ్యక్తి ఒక్క నిమిషంలో అత్యధిక కొవ్వొత్తులను ఆర్పేశాడు.
యూకేలోని స్వాన్సీ నేషనల్ వాటర్ ఫ్రంట్ మ్యూజియంలో ట్యూడర్ ఫిలిప్స్ ఈ ఘనతను సాధించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది సేపటికే బాగా వైరల్ అయింది. లక్షలాది మంది దీన్ని వీక్షించారు.
ఇటువంటి రికార్డును తాను మొదటిసారి చూస్తున్నానని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. చాలా కొత్తగా ప్రయత్నించారు కానీ, దీని వల్ల ఇతరులను ఉపయోగం ఏమీ ఉండని ఓ వ్యక్తి పేర్కొన్నాడు. ఈ రికార్డును మరొకరు బద్దలు కొడతారని కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు.
View this post on Instagram
Frog Meat : బాబోయ్.. కప్పను కూర వండుకుని తిన్న కుటుంబం, ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం