Surprise Marriage Proposal Video: పోలీసులతో కలిసి నాటకం ఆడి.. గర్ల్ ఫ్రెండ్‌కు యువకుడి మ్యారేజ్ ప్రపోజల్

ప్రేమిస్తున్న యువతికి సర్‌ప్రైజ్ ఇవ్వాలని ఓ యువకుడు భావించాడు. మ్యారేజ్ ప్రపోజల్ ను కాస్త వెరైటీగా చేయాలనుకున్నాడు. అందుకు పోలీసుల సాయం కూడా తీసుకోవడం గమనార్హం. తనను పోలీసులు అరెస్టు చేస్తున్నట్లుగా సీన్ క్రియేట్ చేసి, ఆ యువతికి మ్యారేజ్ ప్రపోజల్ చేశాడు. దీంతో ఆ యువతి ఎగిరి గంతులు వేసి, అందుకు ఒప్పుకుంది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Surprise Marriage Proposal Video: పోలీసులతో కలిసి నాటకం ఆడి.. గర్ల్ ఫ్రెండ్‌కు యువకుడి మ్యారేజ్ ప్రపోజల్

Surprise Marriage Proposal Video

Updated On : September 26, 2022 / 9:32 AM IST

Surprise Marriage Proposal Video: ప్రేమిస్తున్న యువతికి సర్‌ప్రైజ్ ఇవ్వాలని ఓ యువకుడు భావించాడు. మ్యారేజ్ ప్రపోజల్ ను కాస్త వెరైటీగా చేయాలనుకున్నాడు. అందుకు పోలీసుల సాయం కూడా తీసుకోవడం గమనార్హం. తనను పోలీసులు అరెస్టు చేస్తున్నట్లుగా సీన్ క్రియేట్ చేసి, ఆ యువతికి మ్యారేజ్ ప్రపోజల్ చేశాడు. దీంతో ఆ యువతి ఎగిరి గంతులు వేసి, అందుకు ఒప్పుకుంది.

ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వాషింగ్టన్ పోలీసు అధికారులు ఈ వీడియోను తమ ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న యువతికి ఆ విషయం చెప్పాలని, ముందుగానే ఓ ప్లాన్ వేసుకున్నాడు మోర్స్ అనే యువకుడు.

తన గర్ల్ ఫ్రెండ్ తో పాటు ఆమె తల్లిదండ్రులను ఓ రెస్టారెంటుకు తీసుకెళ్లాడు. అక్కడకు కొందరు పోలీసులు వచ్చి మోర్స్ ను అరెస్టు చేస్తున్నట్లు నాటకం ఆడారు. అతడికి బేడీలు వేసి బయటకు తీసుకెళ్లారు. అందరూ కంగారు పడుతుండగా మోకాళ్లపై కూర్చొని తన ప్రియురాలికి మ్యారేజ్ ప్రపోజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను బాగా అలరిస్తోంది.

K.Chandrashekar Rao wishes: టీమిండియాకు తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందనలు