K.Chandrashekar Rao wishes: టీమిండియాకు తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందనలు

నిన్న హైదరాబాద్​లోని ఉప్పల్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో సూర్య, కోహ్లీ మెరుపులు మెరిపించడం, అక్షర్‌ పటేల్‌ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా ఘనవిజయం సాధించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్కంఠభరితంగా సాగిన ఆటలో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించారని చెప్పారు. మ్యాచ్ ను ఎటువంటి ఆటంకాలు నిర్వహించేందుకు కృషి చేసిన పోలీసులను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.

K.Chandrashekar Rao wishes: టీమిండియాకు తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందనలు

K.Chandrashekar Rao wishes

Updated On : September 26, 2022 / 7:35 AM IST

K.Chandrashekar Rao wishes: నిన్న హైదరాబాద్​లోని ఉప్పల్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో సూర్య, కోహ్లీ మెరుపులు మెరిపించడం, అక్షర్‌ పటేల్‌ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా ఘనవిజయం సాధించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్కంఠభరితంగా సాగిన ఆటలో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించారని చెప్పారు. మ్యాచ్ ను ఎటువంటి ఆటంకాలు నిర్వహించేందుకు కృషి చేసిన పోలీసులను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.

అలాగే, ఇతర అధికారులు, స్టేడియం సిబ్బందిని కేసీఆర్ అభినందించారు. కాగా, ఉప్పల్​ స్టేడియంలో అద్భుతంగా రాణించిన టీమిండియాపై పలువురు నేతలు, మాజీ క్రీడాకారులు ప్రశంసల జల్లు కురిపించారు. ఇదే ఉత్సాహంతో టీ20 ప్రపంచ కప్ గెలవాలని అన్నారు. నిన్న జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆసీస్​ నిర్దేశించిన 187 లక్ష్యాన్ని భారత బ్యాట్స్ మెన్ 19.5 ఓవర్లలో ఛేదించారు. సూర్య కుమార్​ యాదవ్​ 69 పరుగులు చేయగా, విరాట్​ కోహ్లీ 63 పరుగులు చేశారు. భారత ఫ్యాన్స్ కు పరుగుల విందు అందించారు.

IndVsAus 3rd T20I : ఆస్ట్రేలియాపై భారత్ అద్భుత విజయం, టీ20 సిరీస్ కైవసం