IndVsAus 3rd T20I : ఆస్ట్రేలియాపై భారత్ అద్భుత విజయం, టీ20 సిరీస్ కైవసం

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. చివరి బంతివరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో రోహిత్ సేన అద్భుత విజయం సాధించింది.

IndVsAus 3rd T20I : ఆస్ట్రేలియాపై భారత్ అద్భుత విజయం, టీ20 సిరీస్ కైవసం

IndVsAus 3rd T20I : హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో రోహిత్ సేన అద్భుత విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో ఆసీస్ ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో సిరీస్ ను కూడా కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 187 పరుగుల టార్గెట్ ను మరో బంతి మిగిలి ఉండగానే చేధించింది టీమిండియా. 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 187 రన్స్ చేసింది భారత్.

భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (69), విరాట్ కోహ్లీ (63) హాఫ్ సెంచరీలతో మెరిశారు. జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశారు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా 25 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. విన్నింగ్ షాట్ కొట్టింది పాండ్యానే. ఈ విజయంతో టీమిండియా మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 186 పరుగులు చేసింది. ఓపెనర్ కామెరాన్ గ్రీన్ 52, టిమ్ డేవిడ్ 54, డేనియల్ సామ్స్ 28, జోష్ ఇంగ్లిస్ 24 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ కు 3 వికెట్లు దక్కాయి.

అక్షర్ పటేల్.. వాటే త్రో…

అనంతరం లక్ష్యఛేదనలో టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (1) తొలి ఓవర్లోనే ఔటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే కెప్టెన్ రోహిత్ శర్మ (17) కూడా వెనుదిరగడంతో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ఈ దశలో మాజీ కెప్టెన్ కోహ్లీ, యంగ్ ప్లేయర్ సూర్యకుమార్ దూకుడు ప్రదర్శించడంతో టీమిండియా రన్ రేట్ ఎక్కడా తగ్గలేదు.

దంచికొట్టిన సూర్యకుమార్ యాదవ్..

ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ రెచ్చిపోయాడు. దంచి కొట్టాడు. ఆకాశమే హద్దుగా బౌండరీలతో చెలరేగాడు. ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. యాదవ్ క్రీజులో ఉన్నంతసేపు స్కోర్ బోర్డు పరుగులు తీసింది. 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన సూర్య.. 36 బంతుల్లో 69 పరుగులు చేసి ఔటయ్యాడు. అందులో 5 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. ఆ తర్వాత కాసేపటికి కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తయింది. కోహ్లీకి హార్దిక్ పాండ్యా జతకలవడంతో స్కోరుబోర్డు ముందుకు కదిలింది.

సూర్యకుమార్ యాదవ్ వీరవిహారం

మూడో వికెట్‌కు విరాట్ (40*)తో కలిసి 104 పరుగుల భాగస్వామ్యం నిర్మించిన సూర్యకుమార్‌ యాదవ్.. హేజిల్‌వుడ్‌ వేసిన ఓవర్‌లో సిక్స్‌, ఫోర్‌ బాదాడు. అయితే చివరి బంతికి భారీ షాట్‌కు యత్నించి బౌండరీ లైన్‌ దగ్గర ఫించ్‌ చేతికి చిక్కాడు. దీంతో 134 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్‌ను నష్టపోయింది.

ఆఖర్లో టీమిండియా 6 బంతుల్లో 11 పరుగులు చేయాల్సి వచ్చింది. సామ్స్ వేసిన ఆ ఓవర్లో తొలి బంతికే సిక్స్ కొట్టిన కోహ్లీ, ఆ తర్వాత బంతికే ఔటయ్యాడు. దాంతో 5 బంతుల్లో 5 పరుగులు కావాల్సి ఉండగా, దినేశ్ కార్తీక్ క్రీజులోకి వచ్చాడు. ఓ సింగిల్ తీసి పాండ్యాకు స్ట్రయికింగ్ ఇచ్చాడు. ఎంతో కూల్ గా ఆడిన పాండ్యా ఓ బాల్ వేస్ట్ చేసినా, మరుసటి బాల్ కే ఫోర్ కొట్టి భారత్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

టీ20 సిరీస్.. టీమిండియా కైవసం..