నేడే స్పష్టత: పదవ తరగతి పరీక్షలు వాయిదా!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలను వాయిదా వెయ్యాలని నిర్ణయించుకుంది ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికలకు సైరన్ మ్రోగడంతో జగన్ సర్కార్ పదవ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌లో 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ఈసీకి స్పష్టం చేసింది.
పరీక్షలు వాయిదా వేయాలని తామేమి ప్రభుత్వాన్ని కోరలేదని, కానీ ఇబ్బందులు కలగకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఏపీ ఎన్నికల కమిషనర్ రమేశ్‌బాబు అన్నారు. పరిపాలనలో భాగంగానే పదో తరగతి పరీక్షలను ఏప్రిల్‌లో నిర్వహిస్తామని ప్రభుత్వం తమకు తెలిపిందని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షలు ఈ నెల 23వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు జరగాలి.(ఏపీలో బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు: నేడే షెడ్యూల్ విడుదల)
అయితే ఎన్నికల సమయంలో పరీక్షలు జరిగితే సిబ్బంది కొరత వస్తుందనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందేమోనని, పరీక్షలు ఏప్రిల్‌లో నిర్వహించడం వల్ల తమకు సిబ్బంది కొరత కూడా ఉండదని భావిస్తున్నామని ఎన్నికల కమిషనర్ తెలిపారు. ఇవాళ(07 మార్చి 2020) ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతే టెన్త్ పరీక్షల వాయిదా పరిస్థితి ఏంటి? అనేది పూర్తిగా తెలియనుంది. ఏ పరీక్షలు వాయిదా పడతాయి..? అన్ని పరీక్షలు వాయిదా పడుతాయా? లేకుండే కోన్ని పరీక్షలు వాయిదా? పడుతాయా? అనే దానిపై స్పష్టత రానుంది.