కడప : భగ్గుమన్న పాత కక్షలు..వేట కొడవళ్లతో దాడి

  • Published By: veegamteam ,Published On : October 28, 2019 / 04:57 AM IST
కడప : భగ్గుమన్న పాత కక్షలు..వేట కొడవళ్లతో దాడి

Updated On : October 28, 2019 / 4:57 AM IST

కడప జిల్లా చక్రాయపేట మండలంలో పాత కక్షలు భగ్గుమన్నాయి. కుమార కాల్వ గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో 11మందికి తీవ్రగా గాయాలయ్యాయి. గాయపడిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. 

ఇరు వర్గాల మధ్యా ఘర్షణ జరుగుతోందనే సమాచారం అందుకున్న పోలీసులు హుటా హుటినా ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం ఇరు వర్గాలను చెదరగొట్టారు.  గాయపడినవారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దీంట్లో భాగంగా..గాయపడినవారి నుంచి వాగ్ములాన్ని తీసుకున్నారు. ఈ ఘటనపై అక్కిరెడ్డి పల్లి సీఐ యుగంధర్ మాట్లాడుతూ..గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉందని తెలిపారు.

గ్రామ వాలంటీర్  తాడిపల్లి రాకేశ్ విధి నిర్వహణలో భాగంగా..టీడీపీ కార్యకర్త ఇంటికి కుటుంబ వివరాలు సేకరించేందుకు వెళ్లాడు.  పాతకక్షలు దృష్టిలో పెట్టుకున్న సదరు టీడీపీ కార్యకర్త రాకేశ్ పై చేయి చేసుకున్నాడు.  దీంతో రాకేశ్ వర్గీయులు ఆవేశానికి గురై సదరు టీడీపీ కార్యకర్తతో వాగ్వాదానికి దిగారు. వాగ్వాదం తారాస్థాయికి చేరుకోగా..వేట కొడవళ్లతో ఇరు వర్గాలు దాడికి దిగారు.  ఈ దాడిలో రాకేశ్ తో పాటు అతని పెదనాన్న  ముత్తయ్యకు తీవ్రంగా గాయాలయ్యాయి. గొడవ సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి…ఇరువర్గాలను చెదరగొట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేపట్టారు.