రైలులో గోల్డ్ స్మగ్లింగ్ : 3వేల 314 గ్రాముల బంగారం సీజ్
హైదరాబాద్ : గోల్డ్ స్మగ్లింగ్‌లో చోరులు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు విమానం ద్వారా అక్రమంగా తరలిస్తున్న చోరులు రైళ్లను ఎంచుకున్నారు. సికింద్రాబాద్ నుంచి గుహాటి వెళ్తున్న గుహటి ఎక్స్‌ప్రెస్ రైలులో ఇద్దరు ప్రయాణికుల నుంచి 3వేల314గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్న డీఆర్‌ఐ అధికారులు.. విశ్వసనీయ సమాచారంతో విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.. కాటన్ బనియాన్‌లలో పెట్టుకుని గోల్డ్ స్మగ్లింగ్‌కు పాల్పడుతుండగా పట్టుకున్నారు. కోటి 8లక్షల 69వేల 920 రూపాయల విలువగల గోల్డ్‌ను సీజ్ చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.