కిలో 200: 30నెమళ్లను చంపాడు

కిలో 200: 30నెమళ్లను చంపాడు

Updated On : January 6, 2020 / 11:47 PM IST

ధాన్యం గింజలు తింటున్నాయని విషం పెట్టి 30నెమళ్లను చంపేశాడు. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం చెరువుముందు తండా అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నెల రోజులుగా గ్రామ శివారులోని పొలాల్లో ధాన్యం గింజలను ఆహారంగా తీసుకుంటున్నాయి. వాటిని అడ్డుకోవాలనుకున్నాడు. కొన్ని ధాన్యం గింజలను విషం కలిపి వాటికి ఎరగా వేశాడు. 

వేలుబెల్లి గ్రామానికి చెందిన ఆ వ్యక్తి చేసినట్లుగా అనుమానిస్తున్నారు. లక్ష్మీనర్సుకుంట సమీప అటవీ ప్రాంతంలో జల్లిన గింజలను నెమళ్లు తిన్నాయి. చనిపోయిన వాటి కాళ్లు, ఈకలు, తల తీసేసి మాంసం కిలో రూ.200లకు విక్రయిస్తున్నట్లు తెలిసింది.