చంద్రబాబు ఆస్తుల కేసులో కోర్టుకి లక్ష్మీపార్వతి హాజరు

  • Published By: vamsi ,Published On : April 26, 2019 / 09:01 AM IST
చంద్రబాబు ఆస్తుల కేసులో కోర్టుకి లక్ష్మీపార్వతి హాజరు

Updated On : April 26, 2019 / 9:01 AM IST

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో చంద్రబాబుకు షాక్ తగిలింది. చంద్రబాబు నాయుడి పై నందమూరి లక్ష్మీ పార్వతి వేసిన ఈ కేసులో ఎసిబి కోర్టు విచారణ మే 13వ తేదీ నుంచి ప్రారంభం అవనుంది. 14ఏళ్ల నాటి కేసులో స్టే లను ఎత్తివేయాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశించిన క్రమంలో కేసుపై స్టే ను ఎత్తివేస్తున్నట్లు ఎసీబి కోర్టు లక్ష్మీపార్వతికి వెల్లడించింది. చంద్రబాబు అక్రమంగా ఆస్తులను సంపాదించారంటూ లక్ష్మీపార్వతి 2005లో ఏసీబీకి ఫిర్యాదు చేయగా అఫ్పుడు చంద్రబాబు.. హైకోర్టునుంచి స్టే తెచ్చుకున్నారు.

అయితే ఇటీవల దేశవ్యాప్తంగా స్టేలు అన్నీ సుప్రీంకోర్టు ఎత్తివేసిన క్రమంలో చంద్రబాబు తెచ్చుకున్న స్టే ను కూడా ఎత్తివేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరుకావాలని లక్ష్మీపార్వతికి సమన్లు జారీ చేయగా శుక్రవారం ఆమె కోర్టుకు హాజరయ్యారు.

కేసు స్టేటస్‌పై మే నెల  13వ తేదీ నుంచి హైదరాబాద్‌ ఏసీబీ కోర్టు విచారణ చేపట్టబోతుంది.