పవన్‌కళ్యాణ్‌కు ఆలీ కౌంటర్: ఏం సాయం చేశావ్?

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, కమేడియన్ ఆలీల మద్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఎన్నికలవేళ ఆలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

  • Published By: vamsi ,Published On : April 9, 2019 / 01:27 AM IST
పవన్‌కళ్యాణ్‌కు ఆలీ కౌంటర్: ఏం సాయం చేశావ్?

Updated On : April 9, 2019 / 1:27 AM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, కమేడియన్ ఆలీల మద్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఎన్నికలవేళ ఆలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, కమేడియన్ ఆలీల మద్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఎన్నికలవేళ ఆలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. ఆలీని స్నేహితుడు అని నమ్మితే మోసం చేసి వెళ్ళిపోయాడని, ఆలీ సూచించిన వ్యక్తికే నరసరావు పేట ఎంపీ టికెట్ ఇచ్చినని, ఇప్పుడు ఆలీ ఏమో వైసీపీకి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కష్టాలు వచ్చినప్పుడు.. అవసరం అంటే అండగా ఉన్నానని ఇప్పుడు తనని వదిలేసి వెళ్లాడని అన్నారు.
Read Also : ఆలీ…ఇదేనా స్నేహమంటే : పవన్ కళ్యాణ్

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అలీ కూడా రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ‘ఆలీ కష్టాల్లో ఉంటే సాయపడ్డాను’ అని మీరంటున్నారు.. ఏం సాయ చేశారు? డబ్బిచ్చారా? సినిమాలు లేక ఇంట్లో కూర్చుంటే తీసుకెళ్లి సినిమా అవకాశాలు ఇప్పించారా?’ అంటూ పవన్‌ కల్యాణ్‌ను ప్రశ్నించారు. ‘నా చుట్టానికి జనసేనలో టికెట్‌ ఇచ్చానని అంటున్నారు.. ఆ వ్యక్తికి టికెట్‌ ఇవ్వమని నేనడిగానా? ఇస్తున్నానని ముందుగా మీరు నాకు చెప్పారా?’ అని ఆలీ పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించారు.
Read Also : జనసేన గెలుపు కోసం: మెగా అల్లుడు పూజలు