అతడు-ఆమె-అఫైర్ : కార్తీక్ హత్య, రాగసుధల ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు!!

  • Published By: veegamteam ,Published On : February 29, 2020 / 11:17 AM IST
అతడు-ఆమె-అఫైర్ : కార్తీక్ హత్య, రాగసుధల ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు!!

Updated On : February 29, 2020 / 11:17 AM IST

జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన కార్తీక్ హత్య రాగసుధల ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు బైటపడ్డాయి. వివాహేతర సంబంధమే కార్తీక్ హత్య రాగసుధల ఆత్మహత్యకు కారణమని పోలీసులు విచారణలో తేలింది.  

రాగసుధలు చదువుకునే రోజుల్లోనే ప్రేమించుకున్నారు.  తరువాత వారు వివాహ చేసుకున్నారు. ఈ క్రమంలో రాగసుధ తన సూపర్ సీనియర్ అయిన రవితో వివాహేతర సంబంధం ఉంది. దాన్ని కొనసాగించని క్రమంలో ఈ రెండు దారుణాలు జరిగాయని పోలీసులు తేల్చారు. రాగసుధతో పలుమార్లు మాట్లాడుతున్న క్రమంలో కార్తీక్..రవిలకు గొడవలయ్యాయనీ..అదే కార్తీక్ హత్యకు కారణమైందని తెలిపారు. 

వివారాల్లోకి వెళితే..బురదపేట కాలనీకి చెందిన కార్తీక్ గద్వాలకు చెందిన రాగసుధకు చదువుకునే రోజుల్లోనే పరిచయం ఏర్పడింది.అప్పటికే  అంటే 2011లోనే పెళ్లైన రాగసుధకు ఓ కొడుకు కూడా ఉన్నాయి. అయినా సరే రాగసుధ కార్తీక్ తో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. అంతేకాదు తన సూపర్ సీనియర్ అయిన  రవితో కూడా అదే సంబంధాన్ని కొనసాగించింది. ఇలా ఇద్దర్నీ ఒకరి గురించి మరొకరికి తెలియకుండా మ్యానేజ్ చేసింది.

ఇలా కొనసాగుతున్న క్రమంలో కొన్ని నెలల క్రితం రవితో రాగసుధ సంబధం కొనసాగిస్తోందన్న సంగతి కార్తీక్ కు తెలిసింది. దీంతో సుధతో కార్తీక్ గొడవపడుతుండేవారు. రవితో సన్నిహితంగా ఉంటూ తనను దూరం పెడుతోందని గొడవపడేవారు. దాంతో సుధను వేధించటం ప్రారంభించాడు. ఆవేధింపులు భరించలేక ఆ విషయాన్ని రవితో చెప్పింది. అది విన్న రవి కోపంతో ఊగిపోయాడు. ఎలాగైనాసరే కార్తీక్ ను చంపేయాలనుకున్నాడు. 

దీంతో పక్కా ప్లాన్ వేశాడు. కార్తీక్ కు ఫోన్ చేసిన గద్వాలలోని అగ్రహారం వద్దకు తీసుకెళ్లాడు.అక్కడ కార్తీక్ తలపై రవి గట్టిగా కొట్టి చంపేశాడు. తరువాత అనుమానం రాకుండా పూడ్చిపెట్టేశాడు. ఈ క్రమంలో హత్య కేసు తనపైకి వస్తుందనే భయంతో రాగసుధ ఆత్మహత్య చేసుకుంది.  దీంతో గద్వాలలో కార్తీక్..మెహబూబ్ నగర్ లో రాగసుధ ఆత్మహత్యపై విచారణ చేపట్టిన పోలీసులు ఈ రెండు కేసులకు వివాహేతర సంబంధమే కారణమని తేల్చారు.  

మెహబూబ్ నగర్ కు వెళ్లిన తమ కుమారుడు ఇంకా రాలేదనీ కార్తీక్  తరుచు ఓ అమ్మాయితో ఫోన్ లో మాట్లాడేవాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మాయి తరుపువారు కూడా తమ ఇంటికి వచ్చి కార్తీక్ గురించి ఆరా తీసారని తెలిపారు. దీంతో ఈ రెండు కేసులకు సంబంధం ఉన్నట్లుగా అనుమానించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేయటంతో ఈ రెండు కేసులకు కారణం వివాహేతర సంబంధమేనని తేల్చారు. 

See Also | ఆయన పెద్ద ప్లేబాయ్ బాబోయ్.. విడాకులు ఇప్పించండి – కోర్టును ఆశ్రయించిన నటుడి భార్య