ఆళ్లగడ్డ రాజకీయాలు : అఖిలప్రియ పార్టీ మారుతారా ?

  • Published By: madhu ,Published On : January 9, 2019 / 09:40 AM IST
ఆళ్లగడ్డ రాజకీయాలు : అఖిలప్రియ పార్టీ మారుతారా ?

Updated On : January 9, 2019 / 9:40 AM IST

కర్నూలు : ఏపీ మంత్రి అఖిల ప్రియ పార్టీ మారుతారా ? అలక వెనుక కారణం అదేనంటూ చర్చ జరుగుతోంది. ఆళ్లగడ్డ పోలీసుల తీరును నిరసిస్తూ ఆమె గన్‌మెన్లను తిరస్కరించడంతో జిల్లా టీడీపీలో అంతర్గత పోరు ముదురుతోంది. భూమా వర్గం సీఎం పర్యటనకు దూరంగా ఉండడంతో ఆళ్ళగడ్డ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మంత్రి అఖిల ప్రియ, ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి నియోజకవర్గంలోనే ఉన్నా సీఎం ప్రోగ్రాంలో కనిపించకపోవడంతో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 
జనసేన..వైసీపీలతో చర్చలు…
ఇప్పటికే గన్‌ మెన్లను తిరస్కరించిన మంత్రి, ఎమ్మెల్యే పార్టీ మారే అవకాశం ఉందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే జనసేన, వైసీపీతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. జనసేనలో చేరితే   ఆళ్లగడ్డ, నంద్యాల, పత్తికొండలలో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  
హోం మంత్రి స్పందన…
మరోవైపు మంత్రి అఖిలప్రియ వ్యవహారంపై హోం మంత్రి చినరాజప్ప స్పందించారు. అఖిల ప్రియ తెలుసుకోవాల్సింది చాలా ఉందన్నారు హోంమంత్రి. సమస్యలుంటే పెద్దల దృష్టికి తీసుకురావాలన్నారు. విషయం సీఎం దృష్టికి వెళ్ళిందని.. సమస్యను ఆయన పరిష్కరిస్తారన్నారు హోంమంత్రి చినరాజప్ప.