ఓట్లు వేసిన పాపానికి మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? జైల్లో పెడతారా?: అమరావతి రైతన్నల ఆక్రోశం

  • Published By: veegamteam ,Published On : December 27, 2019 / 06:30 AM IST
ఓట్లు వేసిన పాపానికి మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? జైల్లో పెడతారా?: అమరావతి రైతన్నల ఆక్రోశం

Updated On : December 27, 2019 / 6:30 AM IST

ఓట్లు వేసిన పాపానికి మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారా? ఈ ప్రభుత్వం ఉండదు అంటూ అమరావతి ప్రాంతంలోని మందడం గ్రామంలో ఓ రైతు ఆక్రోశం వెళ్లగ్రక్కాడు. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కావాలంటే తమ భూములు ఇచ్చామనీ ఇప్పుడు ప్రభుత్వం మారినట్లుగా రాజధానిని కూడా మారుస్తామంటే ఊరుకునేది లేదని ఆందోళన చేస్తున్న రైతుల్ని  పోలీసులు అడ్డుకున్నారు. వారిని బలంతంగా వ్యానుల్లోకి ఎక్కించటంతో ఆవేదన చెందిన రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

మా ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి సీఎం అయి ఇప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారా? అంటూ ప్రశ్నిస్తున్నారు అమరావతి ప్రాంతం గ్రామాల్లోని రైతులు. రైతుల్ని బాధ పెట్టిన ఏ ప్రభుత్వం నిలవలేదనీ ఇప్పుడు మా భూములు తీసుకుని మమ్మల్ని అన్యాయంచేస్తూ రాజధానికి తరలిస్తున్నారనీ మాకు న్యాయం చేయమని అడిగితే అరెస్టులు చేస్తారా? మమ్మల్ని దొంగల్లా చూస్తారా? ఇటువంటి ప్రభుత్వం ఎంతో కాలం ఉండని రైతులు శపిస్తున్నారు.

మా ఇంట్లో ఆడవాళ్లు కూడా నడిరోడ్డుమీదికి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం పడిపోతుందని రైతుల్ని..మహిళల్ని వేదనకు గురిచేసే ప్రభుత్వాలు నిలవని అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని రైతులు ఆవేదనతో హెచ్చరిస్తున్నారు. మాకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? మీరు మమ్మల్ని జైల్లో వేసిన మా ఆందోళన మానేది లేదని మందడంలోని రైతులు స్పష్టంచేశారు. మా ఉద్యమాన్ని కొనసాగిస్తామని మూడు రాజధానుల నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని..అమరావతినే రాజధాని అని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.