రాజధాని రైతులు దారిచ్చారు : మంత్రివర్గ సమావేశం నిర్వహణకు సహకారం

రాజధాని ప్రాంత రైతులు దారిచ్చారు. సచివాలయానికి వెళ్లేందుకు దారి వదిలారు. మంత్రివర్గ సమావేశం నిర్వహణకు పూర్తిగా సహకరిస్తామని రైతులు చెప్పారు. రహదారిపై కాకుండా

  • Published By: veegamteam ,Published On : December 26, 2019 / 03:47 AM IST
రాజధాని రైతులు దారిచ్చారు : మంత్రివర్గ సమావేశం నిర్వహణకు సహకారం

Updated On : December 26, 2019 / 3:47 AM IST

రాజధాని ప్రాంత రైతులు దారిచ్చారు. సచివాలయానికి వెళ్లేందుకు దారి వదిలారు. మంత్రివర్గ సమావేశం నిర్వహణకు పూర్తిగా సహకరిస్తామని రైతులు చెప్పారు. రహదారిపై కాకుండా

రాజధాని ప్రాంత రైతులు దారిచ్చారు. సచివాలయానికి వెళ్లేందుకు దారి వదిలారు. మంత్రివర్గ సమావేశం నిర్వహణకు పూర్తిగా సహకరిస్తామని రైతులు చెప్పారు. రహదారిపై కాకుండా పక్కన టెంట్ వేసుకుని ధర్నా కొనసాగించాలని రైతులు నిర్ణయించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని ప్రాంత రైతులు కొన్ని రోజులుగా ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. గురువారం(డిసెంబర్ 26,2019) కూడా ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. మందడంలో టెంట్ వేయడానికి రెడీ అయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు టెంట్ వేయకుండా అడ్డుకున్నారు.

సచివాలయానికి వెళ్లేందుకు దారి ఇవ్వాలని.. మంత్రులు, అధికారులను అడ్డుకోవద్దని కోరారు. వారి విజ్ఞప్తితో రైతులు వెనక్కితగ్గారు. మంత్రివర్గ సమావేశం నిర్వహణకు పూర్తిగా సహకరిస్తామన్నారు. అంతేకాదు.. రోడ్డుపై కాకుండా పక్కన టెంట్ వేసి ధర్నాకు దిగాలని నిర్ణయించారు.

ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రకటన చేసిన రోజు నుంచి రాజధాని ప్రాంతంలో నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. రైతులు, స్థానికులు రోడ్డెక్కారు. వారి ఆందోళనలు 9వ రోజుకు చేరాయి. రాజధాని రైతుల పోరాటం ఇప్పటికే ఉధృతంగా సాగుతోంది. రాజధాని విషయంలో శుక్రవారం(డిసెంబర్ 27, 2019) క్యాబినెట్ భేటీలో సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నేపధ్యంలో గురువారం మరింత ఉధృతంగా ఆందోళనలకు కార్యాచరణ రూపొందించారు రాజధాని గ్రామాల ప్రజలు, రైతులు.

కేబినెట్‌ భేటీ నిర్వహించి తుది నిర్ణయం చెబుతామని ప్రభుత్వం చెప్పింది. దీంతో రాజధాని ప్రాంత రైతుల్లో టెన్షన్ నెలకొంది. రాత్రింబవళ్లు నిద్రాహారాలు మాని పిల్లలతో కలిసి ఆందోళన చేస్తున్నారు. రాజధాని తరలింపు వద్దని డిమాండ్ చేస్తున్నారు. మూడు రాజధానులు వద్దు ఒకటే ముద్దు అని నినదిస్తున్నారు. కేపిటల్ ను అమరావతిలోనే కొనసాగించాలంటున్నారు. కేబినెట్‌ సమావేశ నిర్ణయాన్ని ప్రభావితం చేసే విధంగా ఆందోళనలను మరింత ఉధృతం చేసేందుకు రాజధాని రైతులు సిద్ధమయ్యారు.