ప్రారంభమైన ఏపీ కేబినేట్.. చర్చించే అంశాలు ఇవే!

  • Published By: vamsi ,Published On : May 14, 2019 / 10:12 AM IST
ప్రారంభమైన ఏపీ కేబినేట్.. చర్చించే అంశాలు ఇవే!

Updated On : May 14, 2019 / 10:12 AM IST

ఎన్నో అవాంతరాల అనంతరం ఎట్టకేలకు ఏపీ కేబినేట్ భేటి ప్రారంభం అయ్యింది. ఎన్నికల సంఘం అనుమతితో ఆర్ధికపరమైన అంశాల గురించి చర్చించకూడదనే నిబంధన మీద ఈసీ కేబినేట్ భేటికి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. లోపల తీసుకున్న ఎటువంటి నిర్ణయం కూడా మీడియాకు వెల్లడించకూడదు అని ఈసీ షరతు విధించింది. తుఫాన్, కరువు, ఉపాధి హామీ కల్పనలపై ముఖ్యంగా భేటిలో చర్చ జరగనుంది.

వేసవి నేపథ్యంలో ఏపీలో నెలకొన్న నీటి ఎద్దడి, పశుగ్రాసం కొరత, ఫణి తుఫాను సహాయ, పునరావాస చర్యలు, ఉపాధి హామీ పనులకు నిధుల చెల్లింపు అంశాలపై కేబినెట్ భేటిలో చర్చించనున్నారు. ఈ భేటీకి ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో పాటు మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చినరాజప్ప, కాల్వ శ్రీనివాసులు, పుల్లారావు, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, అయ్యన్నపాత్రుడు, కేఈ కృష్ణమూర్తి, అఖిలప్రియ, కొల్లు రవీంద్ర తదితరులు హాజరయ్యారు. ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడుతో పాటు నలుగురు మంత్రులు మాత్రం ఈ భేటికి హాజరుకాలేదు.