ఫ్రీ ఫ్రీ : రోడ్డుపై టమాట పారపోసిన రైతు

  • Published By: madhu ,Published On : February 16, 2019 / 07:47 AM IST
ఫ్రీ ఫ్రీ : రోడ్డుపై టమాట పారపోసిన రైతు

Updated On : February 16, 2019 / 7:47 AM IST

టమాట ధరలు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మొన్నటి వరకు ఉల్లిగడ్డ ధరలు పెరిగి ప్రజలను ఏడిపిస్తే…ఇప్పుడు టమాట చేరింది. ధరలు పాతాళానికి పడిపోవడంతో టమాట రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకూ తగ్గుతున్న ధరలతో ఆందోళనలో పడ్డారు రైతులు. పెట్టుబడి మాట దేవుడెరుగు.., కనీసం కూలి, రవాణా ఖర్చులు వచ్చే పరిస్థితి లేదని దిగాలు చెందుతున్నారు. ఏం చేయాలి ఈ టమాటను అంటున్నారు. టమాటను రోడ్డుపై పారపోశాడో ఓ రైతు.

ప్రకాశం జిల్లా గిద్దలూరులో టమాట ధరలు అమాంతం పడిపోయాయి. పండించిన పంటకు సరియైన ధర రాకపోవడంతో ఓ రైతు రోడ్డుపై పారిపోశాడు. ఫిబ్రవరి 16వ తేదీ శనివారం వైఎస్ఆర్ సెంటర్‌లో పారపోయడంతో జనాలు టమాటాను ఏరుకొనేందుకు పోటీ పడ్డారు. కూలి ఖర్చులు కూడా రావడం లేదని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. మరి బాబు సర్కార్ స్పందించి తగిన చర్యలు తీసుకుంటుందా ? లేదా ? అనేది చూడాలి.