ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్.. రెండు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. మార్చి 29న ఫలితాలు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. రెండు విడతల్లో స్థానిక ఎన్నికలు జరుగనున్నాయి.

  • Published By: veegamteam ,Published On : March 6, 2020 / 11:16 AM IST
ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్.. రెండు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. మార్చి 29న ఫలితాలు?

Updated On : March 6, 2020 / 11:16 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. రెండు విడతల్లో స్థానిక ఎన్నికలు జరుగనున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. రెండు విడతల్లో స్థానిక ఎన్నికలు జరుగనున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. రెండు విడుతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 21న తొలి విడత ఎన్నికలు, మార్చి 24న రెండో విడత ఎన్నికలు జరుగున్నాయి. మార్చి 27న మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 29న ఎన్నికల కౌంటింగ్, ఫలితాలు విడుదల కానున్నాయి. ఇది ఇప్పటివరకు తెలిసిన సమాచారం మేరకే. రేపు అధికారికంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది. 

మార్చి 7న తొలి విడత ఎన్నికల నోటిషికేషన్ 
మార్చి 7న తొలి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిషికేషన్ విడుదల కానుంది. ఈనెల 9 వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరణ జరుగనుంది. మార్చి 12వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు. మార్చి 14న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇచ్చారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. మార్చి 21న స్థానిక ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈనెల 29న కౌంటింగ్ జరుగనుంది. 

మార్చి 10న రెండో విడత ఎన్నికల నోటిషికేషన్ 
మార్చి 10న రెండో విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిషికేషన్ విడుదల కానుంది. మార్చి 12 నుంచి 14 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. మార్చి 15న నామినేషన్లను పరిశీలించనున్నారు. మార్చి 17న సాయంత్రం 3గంటలకు వరకు నామినేషన్లు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు అభ్యర్థుల తుది జాబితా విడుదల కానుంది. 

మార్చి 13న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్
ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. ఈనెల 13న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈనెల 15 నుంచి 17 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 18న నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. మార్చి 20న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మార్చి 27న పోలింగ్ జరుగనుంది. ఈనెల 29న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి జరుగనుంది. 
 

See Also | 100ఏళ్ల వృద్ధురాలి బర్త్ డే కోరిక విని.. బేడీలు వేసి జైల్లో పడేశారు