బ్రేకింగ్ : గిరిజనులకు ఫించన్ వయస్సు తగ్గింపు

  • Published By: madhu ,Published On : February 11, 2019 / 02:23 AM IST
బ్రేకింగ్ : గిరిజనులకు ఫించన్ వయస్సు తగ్గింపు

Updated On : February 11, 2019 / 2:23 AM IST

విజయవాడ : ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది అన్ని వర్గాలను ఆకట్టుకొనేందుకు ఏపీ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకొంటోంది. ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న వాటిని ఒక్కోక్కటి పరిష్కరిస్తూ ఆయా వర్గాలపై వరాల జల్లు కురిపిస్తున్నారు బాబు. ఇప్పటికే అంగన్ వాడీలు, డ్వాక్రా సంఘాలు, ఇతరత్రా రంగాల వారిని ఆకట్టుకొనే విధంగా పథకాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. గిరిజనులను ఆదుకొనేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు, పథకాలు తీసుకొంటోందని చెప్పిన బాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వారి ఫించన్ వయస్సు విషయంలో సానుకూలంగా స్పందించారు. 

వారికిచ్చే వృద్దాప్య ఫించన్ల విషయంలో వయో పరిమితిని 65 నుండి 50 ఏళ్లకు తగ్గిస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఫిబ్రవరి 10వ తేదీ ఆదివారం ఉత్తర్వులను జారీ చేసింది. ఏజ్‌ని తగ్గించడం వల్ల కనీసం లక్ష మంది గిరిజనులు లబ్ది పొందే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. లబ్ధిదారుల వివరాలు నమోదు చేయాలంటూ ప్రభుత్వం ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేసింది. గతంలోనే సీఎం బాబు ఆదివాసీలపై పలు వరాలు కురిపించిన సంగతి తెలిసిందే. 50ఏళ్లు నిండిన గిరిజనులకు ఫించన్ అందించబోతున్నామని ప్రకటించారు.