ఏపీ బడ్జెట్: పది వేల కోట్లకు పైగా పెన్షన్ల నిధులు

ఏపీ బడ్జెట్: పది వేల కోట్లకు పైగా పెన్షన్ల నిధులు

Updated On : February 5, 2019 / 7:03 AM IST

ఏపీ ప్రభుత్వం ఈ సారి బడ్జెట్‌లో పెన్షన్లకు భారీగానే కేటాయించింది. ఆసరాలేని వారికి ఆదుకునేందుకు భారీ గణాంకాలతో నిధులను విడుదల చేయనుంది. వృద్ధులు, వితంతవులు పెన్షన్లను రూ.10,401.05కోట్లు కేటాయించగా, నిరుద్యోగ భృతి రెట్టింపు చేస్తూ రూ.1000 నుంచి రూ.2000కు పెంచారు. 

వికలాంగుల పెన్షన్లు రూ.2వేల 133కోట్లుగా ప్రకటించిన ప్రభుత్వం డప్పు కళాకారులకు రూ.108కోట్లు, ఎయిడ్స్ రోగులకు రూ.100కోట్ల పెన్షన్‌ను కేటాయించింది.