ఏపీ కేబినెట్ సంచలనం : స్మార్ట్ ఫోన్లు, 10వేల డబ్బు, ఇళ్ల స్థలాలు

  • Published By: veegamteam ,Published On : February 13, 2019 / 06:09 AM IST
ఏపీ కేబినెట్ సంచలనం : స్మార్ట్ ఫోన్లు, 10వేల డబ్బు, ఇళ్ల స్థలాలు

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇదే చివరి సమావేశం అనే ప్రచారం జరగటంతో కీలక అంశాలకు ఆమోద ముద్ర వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తోపాటు.. సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉండటంతో.. మంత్రులందరూ ఈ భేటీకి హాజరయ్యారు. సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది.

కేబినెట్ లో కీలక నిర్ణయాలు ఇవే :

> అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయం. కేంద్రం ఇచ్చే రూ.6వేలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.4వేలు ఇవ్వనుంది. కేంద్ర పథకాన్ని అర్హులు కాని వారికి మాత్రం రూ.10వేల చెల్లింపు రాష్ట్ర ప్రభుత్వం నుంచే వస్తాయి.
> డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు. మూడేళ్లు రీఛార్జ్ ఫ్రీ.
> గిరిజనులకు 50ఏళ్లకే వృద్దాప్య ఫించన్ వర్తింపు
> IAS, IPSలకు రాజధానిలో ఇళ్ల స్థలాల కేటాయింపు.

 

> జర్నలిస్టులకు రాజధాని పరిధిలో 30 ఎకరాల భూమి కేటాయింపు. ఎకరా రూ.10లక్షలే. మూడు విడతల్లో రూ.3 కోట్లు చెల్లించాలి. మొదటి విడతగా కోటి రూపాయలను CRDAకి చెల్లిస్తే సొసైటీకి భూమి కేటాయింపు జరుగుతుంది. మిగతా రెండు డబ్బు చెల్లించటానికి రెండేళ్ల కాల పరిమితి ఇచ్చారు.
> సెక్రటేరియట్ ఉద్యోగులకు 175 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయింపు. గజం రూ.4వేల చొప్పున 230 ఎకరాలు కేటాయింపు
> NGOలకు ఇళ్ల స్థలాలు కేటాయింపు
వీటన్నింటికీ ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.