అందరూ వచ్చి ఓటేయండి : చంద్రబాబు పిలుపు

 వృద్ధులు, మహిళలు, యువకులు ఉదయమే ఆరు గంటలకు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారని, EVMలు పనిచేయకపోవడంతో ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు.

  • Published By: madhu ,Published On : April 11, 2019 / 10:08 AM IST
అందరూ వచ్చి ఓటేయండి : చంద్రబాబు పిలుపు

Updated On : April 11, 2019 / 10:08 AM IST

 వృద్ధులు, మహిళలు, యువకులు ఉదయమే ఆరు గంటలకు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారని, EVMలు పనిచేయకపోవడంతో ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు.

ఏపీకి ఇది ఒక పరీక్షా సమయం. ఈ సమయంలో ఓటు వేసేందుకు ప్రతి ఒక్కరూ కదిలి రావాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రజలు స్వచ్చంధంగా బయటకు వచ్చి ఓటు వేయాలని కోరారు. పోలింగ్ జరుగుతున్న సమయంలోనే ఓ వీడియో రిలీజ్ చేశారు. వృద్ధులు, మహిళలు, యువకులు ఉదయమే ఆరు గంటలకు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారని, EVMలు పనిచేయకపోవడంతో ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ఎన్నికల కమిషన్ ఉద్యోగస్తులను ట్రాన్స్ ఫర్ చేయడంలో చూపిన శ్రద్ధ.. EVMలపై పెట్టలేదని ఆరోపించారు.

ఎన్నికల ఏర్పాట్లలో ఈసీ విఫలం అయ్యిందన్నారు సీఎం చంద్రబాబు. ఎండకాలంలో ఓటర్లు చాలా మంది బాధ పడుతున్నారని.. విద్యార్థులు పరీక్ష రాసే సమయంలో తల్లిదండ్రులు వారికి సపోర్టు ఇస్తుంటారని తెలిపారు. ఏపీకి ఇది పరీక్షా సమయం అన్న బాబు.. ఓటు వేయని వారు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు.