EVMలు బ్యాన్ చెయ్యాలి : చంద్రబాబు సంచలన డిమాండ్
ఏపీ సీఎం చంద్రబాబు ఈవీఎంలపై యుద్ధం ప్రకటించారు. ఈవీఎంలు బ్యాన్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ఈవీఎంలు వద్దు బ్యాలెట్ ముద్దు అనే కొత్త స్లోగన్ వినిపించారు. ఢిల్లీకి వెళ్లి

ఏపీ సీఎం చంద్రబాబు ఈవీఎంలపై యుద్ధం ప్రకటించారు. ఈవీఎంలు బ్యాన్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ఈవీఎంలు వద్దు బ్యాలెట్ ముద్దు అనే కొత్త స్లోగన్ వినిపించారు. ఢిల్లీకి వెళ్లి
ఏపీ సీఎం చంద్రబాబు ఈవీఎంలపై యుద్ధం ప్రకటించారు. ఈవీఎంలు బ్యాన్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ఈవీఎంలు వద్దు బ్యాలెట్ ముద్దు అనే కొత్త స్లోగన్ వినిపించారు. ఢిల్లీకి వెళ్లి ఈసీని కలుస్తానని చంద్రబాబు చెప్పారు. ఏపీలో ఈవీఎంల సమస్యలు ఎందుకు వచ్చాయో అడుగుతానని చెప్పారు. అవసరమైతే ధర్నా చేస్తానని ప్రకటించారు. ఈసీ చేతకాని తనానికి మేం శిక్ష అనుభవించాలా అని మండిపడ్డారు. ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సిందే అన్నారు. ఎంపీలు, మంత్రులను వెంటబెట్టుకుని ఢిల్లీలో ఈసీని కలుస్తానని చంద్రబాబు చెప్పారు.
Read Also : టీడీపీ నేతల బైకులు దగ్ధం : చంద్రగిరిలో టెన్షన్
ఈవీఎంల పనితీరుపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా ఓటు నాకే పడిందా? లేదా? అనే అనుమానం కలుగుతోందన్నారు. నేను వేసిన ఓటు నా పార్టీకే వెళ్లిందా? వేరే పార్టీకి వెళ్లిందా? అనే సందేహం వచ్చిందన్నారు. గతంలో ఓటు వేస్తే నమ్మకం ఉండేదన్నారు. ఈవీఎంలను రిపేర్ చేశారా? ట్యాంపర్ చేశారా? అనే అనుమానం చంద్రబాబు వ్యక్తం చేశారు. ఈవీఎంలు మేనిపులేషన్ చెయ్యలేదన్న గ్యారెంటీ ఏముందన్నారు.
ఇంతటి పనికిమాలిన కమిషన్ ను ఎన్నడూ చూడలేదని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మే 23 తర్వాత మంచి రోజు చూసుకుని ప్రమాణ స్వీకారం ఉంటుందని చంద్రబాబు అన్నారు. చీఫ్ సెక్రటరీ బదిలీపైనా సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక కోవర్ట్ ని, జగన్ సన్నిహితుడిని ఏపీ ప్రధాన కార్యదర్శిగా చేస్తారా అని మండిపడ్డారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం.. డీజీపీ కార్యాలయానికి వెళ్లిన అంశాన్ని చంద్రబాబు తప్పుపట్టారు.
Read Also : ముస్లింలు ఓటు వెయ్యకపోతే ఉద్యోగాలివ్వను