బీజేపీ అడ్రస్ గల్లంతే : జగన్ జపం చేస్తున్న కేసీఆర్

బీజేపీ అడ్రస్ గల్లంతే : జగన్ జపం చేస్తున్న కేసీఆర్

Updated On : June 1, 2023 / 2:46 PM IST

తూర్పుగోదావరి : ప్రధాన మోడీ, కేసీఆర్‌, జగన్‌లపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధాని ఊడిగం చేయమంటే చేసేందుకు కూడా జగన్‌ సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. ఏపీతో అభివృద్ధిలో పోటీ పడలేని కేసీఆర్…జగన్‌ జపం చేస్తున్నారన్నారు. టీడీపీ ఓడిపోతుందంటున్న మోడీ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏంటో చెప్పాలని చంద్రబాబు అన్నారు. 
పోలవరానికి ఎన్ని కోట్లు ఇచ్చారు…
తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు.. 24 వేల కోట్ల రూపాయల రైతుల రుణాలను మాఫీ చేశామన్నారు. పెట్టుబడి నిధి కింద డ్వాక్రా సంఘాలకు 10వేల కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు ఇచ్చామంటున్న ప్రధాని మోడీ…ఎన్ని కోట్లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన ప్రాంతాలకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదని హైకోర్టు ప్రశ్నిస్తే…కేంద్రం దగ్గర సమాధానం లేదన్నారు.
వైసీపీ..కేసీఆర్‌లపై మండిపాటు…
వైసీపీ, కేసీఆర్‌లపైనా చంద్రబాబు విరుచుకుపడ్డారు. మొన్న కోడి కత్తి…నేడు సీబీఐ కత్తి జగన్‌పై వేలాడుతోందన్న బాబు…ప్రధాని ఏం చేయమంటే జగన్ అది చేస్తారని విమర్శించారు. ప్రధాని ఊడిగం చేయమంటే…చేసేందుకు కూడా జగన్‌ రెడీగా ఉన్నారన్నారు. ఏపీతో అభివృద్ధిలో పోటీ పడలేని కేసీఆర్…మనల్ని దెబ్బ తీసేందుకు జగన్‌ జపం చేస్తున్నారని మండిపడ్డారు.