చంద్రబాబు,వెంకయ్య, పవన్ లపై సీఎం జగన్ సెటైర్లు : మీ పిల్లలది ఏ మీడియమో చెప్పండి

గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి జీవో కూడా జారీ చేసింది. ఈ విషయంపై విపక్షాలు విమర్శలపై సీఎం జగన్ స్పందించారు.
విజయవాడలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశంపై విపక్షాలు చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు. మాజీ సీఎం చంద్రబాబు, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై సీఎం జగన్ విరుచుకుపడ్డారు. చంద్రబాబూ.. కొడుకు లోకేశ్ ఏ మీడియంలో చదువుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. తెలుగు భాషను గౌరవించాలని చెబుతున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారూ..మీ పిల్లలు..మనుమలు ఏ మీడియంలో చదువుకున్నారో చెప్పండి.. మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కళ్యాణ్ గారూ..మీ పిల్లలు..ఏ మీడియంలో చదువుతున్నారో చెప్పండి..అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
పేద పిల్లలు చదువుకుని నేటి పోటీ ప్రపంచంలో గెలవాలంటే ఇంగ్లీస్ భాష చాలా ముఖ్యమనీ అటువంటి మంచి ఉద్ధేశ్యంతో ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశంపై ఇటువంటి యాక్టర్లు ఇటువంటి విమర్శలు చేయటం సిగ్గుచేటని మండిపడ్డారు. మన పిల్లలకు మనం ఇచ్చేది చదువు మాత్రమేనని అన్నారు. విద్యాసంస్థల అభివృద్ధి కోసం అబుల్ కలాం ఆజాద్ చేసిన కృషి ఎనలేనిదని సీఎం జగన్ అన్నారు.