కరోనా ఎఫెక్ట్, ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేసింది. వంతుల వారీగా పని విధానం అమలుకు నిర్ణయం

  • Published By: veegamteam ,Published On : March 22, 2020 / 04:34 AM IST
కరోనా ఎఫెక్ట్, ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం

Updated On : March 22, 2020 / 4:34 AM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేసింది. వంతుల వారీగా పని విధానం అమలుకు నిర్ణయం

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేసింది. వంతుల వారీగా పని విధానం అమలుకు నిర్ణయం తీసుకున్నారు. ఉన్నతాధికారులు మినహా మిగతా వారిని రెండు టీమ్ లుగా విభజించారు. గెజిటెడ్ అధికారులు మాత్రం విధులకు హాజరుకావాలని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 60ఏళ్లు పైబడిన సలహాదారులు, చైర్ పర్సన్లు ఇంటి నుంచి పని చేయాలని ఆదేశాలు ఇచ్చారు. 50 ఏళ్లు పైబడి అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగులు ఇంటి నుంచే సేవలు అందించే అవకాశం కల్పించారు. ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగానే కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. ఉద్యోగులకు 9.30 గంటలు, 10 గంటలు, 10.30 గంటలకు వేర్వేరు షిఫ్ట్ లలో హాజరవుతారు. ఏప్రిల్ 4వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా పెరుగుతోంది. వ్యాక్సిన్ లేని ప్రాణాంతకమైన కరోనా వైరస్ 185 దేశాలకు వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా 3లక్షల 6వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 13వేల 17మంది కరోనాతో చనిపోయారు. 90వేల 943 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇటలీలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఇటలీలో ఒక్క రోజే 793 మంది చరిపోయారు. ఇటలీలో ఇప్పటివరకు కరోనాతో 4వేల 825మంది మరణించారు.

కరోనా భారత్ లోనూ విజృంభిస్తోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 332కి చేరింది. నలుగురు చనిపోయారు. 22 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 21కి చేరింది. ఏపీలో 5 కరోనా కేసులు నమోదయ్యాయి. మన దేశంలో 22 రాష్ట్రాలకు మహమ్మారి విస్తరించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 63 కరోనా కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది.
 
రోజురోజుకు ప్రభావం పెంచుకుంటూ.. కరోనా వైరస్ తెలుగు ప్రజలను కూడా భయాందోళనకు గురి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజే ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏపీలో ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు కరోనా బాధితులు ఉండగా.. లేటెస్ట్‌గా రాజమహేంద్రవరం, విజయవాడల్లో ఒక్కొక్కరికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది.