కోడికత్తి కేసులో విశాఖలో హైడ్రామా

వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఎటాక్ కేసును హైకోర్టు ఆదేశాల మేదరకు జాతీయ దర్యాప్తు సంస్థ అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్ఐఏ అధికారులు విశాఖకు చేరుకున్న క్రమంలో హైడ్రామా నెలకొంది. ఎన్ఐఏ అధికారులు ఈ కేసు విచారణను చేపట్టేందుకు జనవరి 5 ఉదయం  కేసు వివరాలను తమకు అప్పగించాలని ఏపీ పోలీసులను కోరగా..దీనికి విశాఖ పోలీసులు నిరాకరించారు.

  • Published By: veegamteam ,Published On : January 5, 2019 / 07:07 AM IST
కోడికత్తి కేసులో విశాఖలో హైడ్రామా

వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఎటాక్ కేసును హైకోర్టు ఆదేశాల మేదరకు జాతీయ దర్యాప్తు సంస్థ అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్ఐఏ అధికారులు విశాఖకు చేరుకున్న క్రమంలో హైడ్రామా నెలకొంది. ఎన్ఐఏ అధికారులు ఈ కేసు విచారణను చేపట్టేందుకు జనవరి 5 ఉదయం  కేసు వివరాలను తమకు అప్పగించాలని ఏపీ పోలీసులను కోరగా..దీనికి విశాఖ పోలీసులు నిరాకరించారు.

విశాఖ : వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఎటాక్ కేసును హైకోర్టు ఆదేశాల మేదరకు జాతీయ దర్యాప్తు సంస్థ అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్ఐఏ అధికారులు విశాఖకు చేరుకున్న క్రమంలో హైడ్రామా నెలకొంది. ఎన్ఐఏ అధికారులు ఈ కేసు విచారణను చేపట్టేందుకు జనవరి 5 ఉదయం  కేసు వివరాలను తమకు అప్పగించాలని ఏపీ పోలీసులను కోరగా..దీనికి విశాఖ పోలీసులు నిరాకరించారు. ప్రభుత్వ అనుమతి లేనిదే తాము ఏమీ చేయలేమని ఎన్ఐఏ అధికారులకు స్పష్టం చేశారు. 
2018 అక్టోబర్ 25న విశాఖపట్నం విమానాశ్రయంలో శ్రీనివాసరావు అనే యువకుడు కోడికత్తితో దాడిచేసిన క్రమంలో జగన్ ను చంపాలనే ఈ దాడిచేసినట్లు సిట్ అధికారుల విచారణలో తేలింది. అయినా ఏపీ పోలీసుల విచారణపై తనకు నమ్మకం లేదనీ..ఈ కేసును కేంద్ర సంస్థతో విచారణ జరిపించాలంటూ జగన్ హైకోర్టులో పిటీషన్ వేయటంతో దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కేసును సిట్ ఎన్ఐఏకు బదిలీ చేయటంతో విశాఖకు చేరుకున్న అధికారులకు ఏపీ పోలీసులు కేసును అప్పగించేందుకు నిరాకరిస్తున్న క్రమంలో ఏం జరుగుతుందో తెలియాల్సివుంది.