లక్షల ఇళ్లు నిర్మించాం.. వైసీపీ ప్రభుత్వం ఇవ్వట్లేదు: అచ్చెన్నాయుడు

  • Published By: vamsi ,Published On : December 16, 2019 / 04:24 AM IST
లక్షల ఇళ్లు నిర్మించాం.. వైసీపీ ప్రభుత్వం ఇవ్వట్లేదు: అచ్చెన్నాయుడు

Updated On : December 16, 2019 / 4:24 AM IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఇళ్ల నిర్మాణం విషయంలో చర్చ జరుగుతుంది. ఈ సంధర్భంగా మాటల యుద్ధం నడుస్తుంది. ఈ విషయంపై మాట్లాడిన  తెలుగుదేశం నేత కింజారపు అచ్చెన్నాయుడు టీడీపీ హయాంలో లక్షలాది ఇళ్ల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు.

వైసీపీ ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణంపై పట్టించుకోట్లేదని విమర్శించారు అచ్చెన్నాయుడు. లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయినా ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇళ్ల నిర్మాణంపై హౌస్‌ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో పేదలకు నాణ్యమైన ఇళ్లు నిర్మించామని వైసీపీ వట్టి మాటలు చెబుతుందని అన్నారు. దీనిపై మేం తప్పు చేసినట్టు నిరూపిస్తే ఎలాంటి చర్యలకైనా సిద్ధమని అన్నారు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు.