ఎన్నికల వరాలు : పండుగ పూట రెండు సిలిండర్లు – బాబు

  • Published By: madhu ,Published On : April 3, 2019 / 10:46 AM IST
ఎన్నికల వరాలు : పండుగ పూట రెండు సిలిండర్లు – బాబు

Updated On : April 3, 2019 / 10:46 AM IST

మహిళల ఓట్లపై సీఎం బాబు నజర్ పెట్టారు. ఎన్నికల్లో భాగంగా వారిపై వరాల జల్లు కురిపిస్తూ అట్రాక్ట్ చేసేందుకు బాబు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పసుపు – కుంకుమ పథకం ప్రకటించిన బాబు..దానికి సంబంధించిన నగదును బ్యాంకులో జమ చేసినట్లు చెప్పారు. ఏప్రిల్ 05వ తేదీన చెక్కులు ఇచ్చి డబ్బులు తీసుకోవాలన్నారు బాబు. ఈ చెక్కులు చెల్లవని వైసీపీ చెబుతోందని..వారి మొహాలే చెల్లవని ఎద్దేవా చేశారు. సామాజిక న్యాయం కోసం ముందుకెళుతున్నట్లు తెలిపారు. అవకాశవాద రాజకీయాలకు స్వస్తి పలికి..ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 03వ తేదీ నెల్లూరు జిల్లా ఉదయగిరిలో బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ..

మగవారితో సమానంగా మహిళలకు అవకాశం కల్పిస్తున్నట్లు వీరికి ఆత్మగౌరవం రావాలన్నారు. డ్వాక్రా సంఘాలు పెట్టి డబ్బులు సంపాదించేలా చేస్తున్నట్లు తెలిపారు. దీపం, వంటగ్యాస్..పథకాలు ప్రవేశపెట్టిన తాము..పండగుల పూట రెండు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. డబ్బులు ఉంటే ఎక్కువ ఇచ్చేవాడినన్నారు. రాష్ట్రంలో 29 లక్షల ఇళ్లు నిర్మాణం చేస్తున్నట్లు..అందులో 11 లక్షల ఇళ్లకు గృహ ప్రవేశం చేశామన్నారు. సొంతింటిలో ఉండాలనే కల నిజం చేస్తామని హామీనిచ్చారు. ఉదయగిరిలో ఉన్న వారంతా తిరిగి వచ్చే విధంగా డెవపల్ మెంట్ చేస్తానని బాబు హామీనిచ్చారు. 

అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు జనసేన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆడపడుచులకు వంటింటి కష్టాలు తీర్చేందుకే ఈ నిర్ణయమని వెల్లడించింది. రేషన్‌కు బదులుగా మహిళల ఖాతాల్లో రూ. 2500 – 3500 మధ్య నగదు జమ చేస్తామని పవన్ హామీనిస్తున్నారు. మరి ఈ గ్యాస్ సిలిండర్ల హామీలు పనిచేసేనా ? లేదా ? అనేది తెలియాలంటే కొద్ది రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే.