బిల్డ్ ఏపీ ఫస్ట్ ప్రాజెక్ట్ : బూత్ బంగ్లాను తలపించే భవనాలు విక్రయం

జగన్ ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ‘బిల్డ్ ఏపీ’ పేరుతో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కొత్త మిషన్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మిషన్‌లో భాగంగా

  • Published By: veegamteam ,Published On : November 10, 2019 / 12:02 PM IST
బిల్డ్ ఏపీ ఫస్ట్ ప్రాజెక్ట్ : బూత్ బంగ్లాను తలపించే భవనాలు విక్రయం

Updated On : November 10, 2019 / 12:02 PM IST

జగన్ ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ‘బిల్డ్ ఏపీ’ పేరుతో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కొత్త మిషన్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మిషన్‌లో భాగంగా

‘బిల్డ్ ఏపీ’ పేరుతో జగన్ ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ మిషన్‌లో భాగంగా ప్రభుత్వ భూములను గుర్తించి, భవన సముదాయాలు నిర్మించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మిగతా భూముల్లో మౌలిక వసతులను కల్పించాలని నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. బిల్డ్ ఏపీ కార్యక్రమానికి సంబంధించి అధికారులు తొలి ప్రాజెక్ట్ పని ప్రారంభించారు.

బిల్డ్ ఏపీ మిషన్ అమల్లో భాగంగా నిధుల సమీకరణ కోసం రెండెకరాల నిరుపయోగ భూమిని విక్రయించేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. స్టేట్ గెస్ట్ హౌస్ ప్రాంగణంలోని ఖాళీ స్థలాన్ని, బూత్ బంగ్లాను తలపిస్తున్న భవనాలను విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

అధునాతన భవనాలకు, కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఇది అనువైన ప్రదేశం అని అధికారులు అంటున్నారు. మాల్స్, మల్టీప్లెక్సుల నిర్మాణానికి అనువైన స్థలం అని అధికారులు భావిస్తున్నారు. అభివృద్ధితో పాటు ఉద్యోగాల కల్పన కూడా వస్తుందని చెబుతున్నారు. విజయవాడ నగరానికి తలమానికంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. దీని ద్వారా రూ.200 కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు.

ఎన్బీసీసీ సంస్థతో కలిసి బిల్డ్ ఏపీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. ప్రభుత్వ భూములు, ఆక్రమణలు, వివాదాల్లో ఉన్న భూముల వివరాలను ప్రభుత్వం సేకరించనుంది. మార్కెట్ ధరకు ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు వాటిని విక్రయించాలని నిర్ణయించింది. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వ భూముల వివరాలు ఇవ్వాలని జాయింట్ కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. బిల్డ్ ఏపీ మిషన్ డైరక్టర్ గా ప్రవీణ్ కుమార్ ను ప్రభుత్వం నియమించింది.