చంద్రబాబు ప్రశ్న : ప్రధాని మోడీ హెలికాప్టర్‌ను తనిఖీ చేశారా

అమరావతి : ఏసీ సీఎం చంద్రబాబు మరోసారి ప్రధాని మోడీ, ఈసీపై మండిపడ్డారు. మోడీ చెప్పినట్టే ఈసీ పని చేస్తోందని ఆరోపించారు. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడిన పార్టీలపై

  • Published By: veegamteam ,Published On : April 17, 2019 / 02:52 PM IST
చంద్రబాబు ప్రశ్న : ప్రధాని మోడీ హెలికాప్టర్‌ను తనిఖీ చేశారా

Updated On : April 17, 2019 / 2:52 PM IST

అమరావతి : ఏసీ సీఎం చంద్రబాబు మరోసారి ప్రధాని మోడీ, ఈసీపై మండిపడ్డారు. మోడీ చెప్పినట్టే ఈసీ పని చేస్తోందని ఆరోపించారు. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడిన పార్టీలపై

అమరావతి : ఏసీ సీఎం చంద్రబాబు మరోసారి ప్రధాని మోడీ, ఈసీపై మండిపడ్డారు. మోడీ చెప్పినట్టే ఈసీ పని చేస్తోందని ఆరోపించారు. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడిన పార్టీలపై రాజకీయ కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. కర్నాటక, ఒడిశా సీఎంల హెలికాప్టర్లలో ఈసీ ఫ్లయింగ్ స్క్కాడ్ తనిఖీలు చేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు చెందిన సీఎంల హెలికాప్టర్లలో మాత్రమే తనిఖీలు చేయడాన్ని తప్పుపట్టారు. కర్నాటక సీఎం హెలికాప్టర్ ను తనిఖీ చేస్తారు, ఒడిశా సీఎం హెలికాప్టర్ ను తనిఖీ చేస్తారు.. కానీ ఒక్క బీజేపీ సీఎం హెలికాప్టర్ ను తనిఖీ చేశారా? ప్రధాని మోడీ హెలికాప్టర్ ను తనిఖీ చేశారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రధాని హెలికాప్టర్ లో ఎందుకు తనిఖీ చేయరని ఈసీని నిలదీశారు.    

రిటైర్ట్ ఐఏఎస్ ల తీరుపైనా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ లు తనను ఎందుకు విమర్శిస్తున్నారు అని చంద్రబాబు ప్రశ్నించారు. సీఎస్, ఎస్పీలను అకారణంగా ఈసీ బదిలీ చేస్తే మాజీ ఐఏఎస్ లు ఎందుకు మాట్లాడలేదన్నారు. జగన్ కేసులో ఎల్వీ సుబ్రహ్మణ్యం పేరు లేదా? అని అడిగారు. ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో మోడీకి తెలిసిపోతుందని గుజరాత్ ఎమ్మెల్యే అంటున్నారని, ఇలాంటి వాటి గురించి తాను మాట్లాడితే.. రిటైర్డ్ ఐఏఎస్ లు నన్ను విమర్శిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీలో పని చేస్తే.. ఏం జరుగుతుందో రిటైర్డ్ ఐఏఎస్ లకు తెలుస్తుందన్నారు. హైదరాబాద్ లో కూర్చుని విమర్శలు చేయడం సరికాదన్నారు.

ఈవీఎంలపై విమర్శలు వస్తున్నా ఈసీ స్పందించడం లేదని చంద్రబాబు అన్నారు. ఈవీఎంలు 24గంటలు ఆలస్యంగా ఇస్తే ఎలా అర్థం చేసుకోవాలన్నారు. వీవీప్యాట్లు లెక్కించడానికి అభ్యంతరాలు ఏంటో చెప్పాలని ఈసీని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఫారం-7 దుర్వినియోగం అయ్యిందని తెలిసినా చర్యలు తీసుకోలేదన్నారు. ఐపీ అడ్రస్సులు ఇవ్వకుండా దొంగలను ఈసీ రక్షిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. నేను కర్నాటక వెళితే రేవణ్ణపై, తమిళనాడు వెళితే కనిమొళిపై ఐటీ సోదాలు చేయడం దారుణం అన్నారు.