ఏకపక్ష నిర్ణయాలు ఎలా తీసుకుంటారు : ఈసీపై చంద్రబాబు ఆగ్రహం
అమరావతి : ఈసీపై ఏపీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఈసీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, వైసీపీ చెప్పినట్టు ఈసీ నడుచుకుంటోందని, టీడీపీ

అమరావతి : ఈసీపై ఏపీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఈసీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, వైసీపీ చెప్పినట్టు ఈసీ నడుచుకుంటోందని, టీడీపీ
అమరావతి : ఈసీపై ఏపీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఈసీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, వైసీపీ చెప్పినట్టు ఈసీ నడుచుకుంటోందని, టీడీపీ నేతలను టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం తీరుని బాబు తప్పుపట్టారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదిని కలిసిన చంద్రబాబు.. కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
అధికారులను ఇష్టానుసారంగా ట్రాన్స్ ఫర్ చేస్తున్నారని మండిపడ్డారు. అర్థరాత్రి బదిలీలపై సీరియస్ అయ్యారు. ఒక సీఎం.. ఎన్నికల అధికారిని కలవడం ఇదే ఫస్ట్ టైమ్ అని చంద్రబాబు అన్నారు. అధికారులను బదిలీ చేసే అధికారం ఈసీకి ఎవరిచ్చారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏ తప్పు చేయని అధికారులను, వెరిఫై చెయ్యకుండానే ఎలా ట్రాన్సఫర్ చేస్తారని అడిగారు.
Read Also : తెలుసుకోండి : పోలింగ్ బూత్ లోకి వీటికి అనుమతి లేదు
వైసీపీ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రధాని మోడీ దేశాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల అభ్యర్థులపై ఐటీ దాడులు చేయొద్దని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయని చంద్రబాబు గుర్తు చేశారు. జగన్ డైరెక్షన్ లో మోడీ పని చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ సహా 22 పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశాయని, ఈవీఎంల బదులు బ్యాలెట్ పేపర్లు వాడాలని కోరాయని, ఈసీ పట్టించుకోలేదని చంద్రబాబు చెప్పారు.
50శాతం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి వచ్చిందని చంద్రబాబు అన్నారు. వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కింపునకు 6 రోజుల సమయం పడుతుందని సీఈసీ సుప్రీకోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చిందని చంద్రబాబు మండిపడ్డారు.
Read Also : పోలింగ్‌కు ముందు సానుభూతి కోసం చంద్రబాబు కుట్రలు