మాజీ పీఎం జోస్యం : భావి భారత ప్రధాని చంద్రబాబే

దేశానికి భావి భారత ప్రధాని చంద్రబాబు నాయుడని మాజీ ప్రధాని దేవేగౌడ అన్నారు. టీడీపీ తరపున ప్రచారంలో పాల్గొన్న ఆయన..

  • Published By: veegamteam ,Published On : April 9, 2019 / 03:55 AM IST
మాజీ పీఎం జోస్యం : భావి భారత ప్రధాని చంద్రబాబే

Updated On : April 9, 2019 / 3:55 AM IST

దేశానికి భావి భారత ప్రధాని చంద్రబాబు నాయుడని మాజీ ప్రధాని దేవేగౌడ అన్నారు. టీడీపీ తరపున ప్రచారంలో పాల్గొన్న ఆయన..

దేశానికి భావి భారత ప్రధాని చంద్రబాబు నాయుడని మాజీ ప్రధాని దేవేగౌడ అన్నారు. టీడీపీ తరపున ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే శక్తి చంద్రబాబుకే ఉందన్నారు. రాజ్యాంగ  వ్యవస్థలను మోదీ భ్రష్టుపట్టించారని, తమ వ్యతిరేకులను ఐటీ, ఈడీ దాడులతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చంద్రబాబునే మరోసారి ముఖ్యమంత్రిగా  ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

మాజీ ప్రధాని దేవేగౌడ తెలుగుదేశం పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సోమవారం(ఏప్రిల్ 8, 2019) అమరావతి చేరుకున్న ఆయన.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ  అయ్యారు. తాజా రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఎన్నికలకు ముందు ఈసీ భారీగా అధికారుల బదిలీలు చేయడాన్ని దేవెగౌడ తప్పు పట్టారు. కృష్ణాజిల్లా తిరువురులో చంద్రబాబుతో కలిసి దేవేగౌడ  ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. భావి భారత ప్రధాని చంద్రబాబు అని సంబోధిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే శక్తి ఆయనకుందని, బాబు మాత్రమే రాష్ట్రాన్ని నడిపించగలరని  దేవెగౌడ స్పష్టం చేశారు. మోడీ రాజ్యాంగ వ్యవస్థలను మోదీ భ్రష్టుపట్టించారని, తమ వ్యతిరేకులను ఐటీ, ఈడీ దాడులతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Read Also : మైలవరానికి రూ.100 కోట్లు.. మంగళగిరికి రూ.200 కోట్లు పంపారు

పామర్రు సభలో టీడీపీ వ్యవస్థాపక అధినేత ఎన్టీఆర్‌పై దేవేగౌడ ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ స్వస్థలం అయిన కృష్ణా జిల్లాకు రావడం ఆనందంగా ఉందన్నారు. జాతీయ పార్టీలే దేశ రాజకీయాలను శాసిస్తున్న  రోజుల్లో ప్రాంతీయ పార్టీలు కూడా దేశాన్ని శాసించగలవని నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా నిరూపించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ప్రధాని మోదీని ఎదిరించగల సత్తా దేశంలో ఒక్క చంద్రబాబుకే సొంతం అని అన్నారు  దేవేగౌడ. దేశానికి ప్రస్తుత కాలంలో చంద్రబాబునాయుడు వంటి నేతల అవసరం ఎంతో ఉందన్నారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చంద్రబాబునే మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని దేవెగౌడ ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ కోర్టుల చుట్టూ తిరుగుతుంటే.. రాష్ట్ర అభివృద్ధిలో రాజీ  పడకుండా చంద్రబాబు పనిచేస్తున్నారని చెప్పారు. వీవీ ప్యాట్ల విషయంలో తమ పోరాటం కొనసాగుతుందన్నారు. సుప్రీంతీర్పును స్వాగతిస్తున్నామన్న దేవెగౌడ…..బ్యాలెట్‌ వాడకంపై పార్టీలన్ని కలిసికట్టుగా పని  చేస్తాయన్నారు. చంద్రబాబును దేశ వ్యాప్తంగా పర్యటించి… నాన్-బీజేపీ పార్టీలను కలపాలని సూచించినట్లు దేవెగౌడ వెల్లడించారు.
Read Also : సర్వేలు అనుకూలం: ఓటమి భయంతో వైసీపీ బెంబేలు