వైసీపీది నేరగాళ్ళ ప్రకటన : టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు

అమరావతి: ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్ధుల ప్రకటన చూస్తుంటే నేరగాళ్ళ ను ప్రకటించినట్లుందని విమర్సించారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మంగళవారం ఆయన పార్టీ నేతలతో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. “జగన్ అభ్యర్ధులను ప్రకటించిన విధానంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఒక వైపు నందిగం సురేష్, మరోవైపు ధర్మాన ప్రసాదరావు, మధ్యలో 12 చార్జిషీట్లలో ఏ1 నిందితుడు జగన్మోహన్ రెడ్డి కూర్చుని పేర్లు ప్రకటిస్తుంటే నేరస్ధుల పేర్లు ప్రకటించినట్లుందని చంద్రబాబు ధ్వజమెత్తారు. నందిగం సురేష్ రాజధానిలో అరటి తోటలు తగులపెట్టిన కేసుల్లో నిందితుడని, రెవిన్యూ మంత్రిగా ధర్మానపై అనేక ఆరోపణలున్నాయని, కన్నెధార గ్రానైట్ కొండలు తవ్వేసిన నిందితుడు ధర్మాన ప్రసాదరావు…. అటు ధర్మాన, ఇటు సురేష్ మధ్య జగన్మోహన్ రెడ్డి లను చూస్తుంటే వైసీపీ నేరగాళ్లకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని దుయ్యబట్టారు.
Read Also : వైసీపీ నుంచి టీడీపీ గూటికి మాజీ ఎమ్మెల్యే
ఈఎన్నికల్లో టీడీపీ నేరగాళ్శతో పోటీ పడుతోందని ధ్వజమెత్తారు. కార్యకర్తలు అందరి అభిప్రాయాలు తీసుకునే టీడీపీ గెలిచే అభ్యర్ధులను ఎంపిక చేశామని, ఇక టీడీపీ గెలుపు ఏకపక్షమేనని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ ని గెలిపించాలని ప్రభుత్వ పధకాల వల్ల లబ్దిపొందిన వారు కసిగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. “ఇక తెలుగుదేశం గెలుపు ఏకపక్షం కావాలి..నామినేషన్లలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి…సాంకేతిక ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి…వీవీ ప్యాట్ మెషిన్లపై అవగాహన పెంచుకోవాలి…పోలింగ్ లోపు వైసీపీ మరెన్ని అక్రమాలు చేస్తుందో..?…నామినేషన్ల తేది, ఉప సంహరణ, పోలింగ్ వరకు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి” అని చంద్రబాబు కార్యకర్తలకు సూచించారు.