బేరాల్లేవ్: భారీగా తగ్గిన చికెన్ ధర

తినకూడని మాసాల్లేవ్.. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం చెకెన్, మటన్ ధరలు భారీగా తగ్గిపోయాయి. నిన్న మొన్నటివరకు ఆకాశమే హద్దుగా ఉన్న చికెన్ రేట్లు మన దిగిచ్చాయి. మాములుగా కాదు. రూ. 200 వరకు ఉన్న చికెన్ ఇప్పుడు ఏకంగా రూ. 80 తగ్గి రూ.120కి దిగిపోయింది.
రాష్ట్రంలో కోళ్లకు వైరస్ ఉండడం.. ఇతర దేశాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో.. చికెన్ వినియోగం బాగా తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోండగా.. ఫారం కోడి కిలో రూ.100 నుంచి రూ.60కి తగ్గిపోయింది. చికెన్ ధరలు తగ్గుముఖం పట్టడంతో చికెన్ రిటైల్‌గా కిలో రూ.120 అంటూ బోర్డులు పెట్టినా, కొనుగోళ్లు లేక చికెన్‌షాపులు కళ తగ్గిపోయింది.
అంతేకాదు.. హోటళ్లలో కూడా నాజ్ వెజ్ అమ్మకాలు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తుంది. రెస్టారెంట్లలో నాన్‌వెజ్ ఫుడ్ ఆర్డర్లు తగ్గగా.. ఆ మార్కెట్ మీద తీవ్ర ప్రభావం పడింది. ఇంకో వారంలో శివరాత్రి కూడా వస్తుండగా.. ఆ ప్రభావం కూడా చికెన్ ధరల మీద పడవచ్చు. ఇంకా కూడా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
కోడిగుడ్ల ధరలు కూడా కొంచెం తగ్గుముఖం పట్టింది. తెలంగాణలో వంద గుడ్లు రూ.420 నుంచి రూ.380కి తగ్గింది. ఏపీలోనూ రూ.20 తగ్గింది.