మృత్యుంజయురాలు : ఇంట్లో బంది..4 రోజులు నీళ్లు తాగుతూ బతికిన బాలిక

  • Published By: madhu ,Published On : April 28, 2019 / 02:58 AM IST
మృత్యుంజయురాలు : ఇంట్లో బంది..4 రోజులు నీళ్లు తాగుతూ బతికిన బాలిక

Updated On : April 28, 2019 / 2:58 AM IST

కనిపించకుండా పోయిన కూతురు..4 రోజులు తర్వాత తల్లి ఒడికి చేరుకుంది. ఉన్నన్నీ రోజులు..నీళ్లు తాగుతూ ప్రాణాలు కాపాడుకొంది బాలిక. తమ పాప కనిపించడం లేదంటూ..కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులకు కూతురు క్షేమంగా ఉందని తెలియడంతో సంతోషం వ్యక్తం చేశారు. అసలు ఆమె ఎందుకు ఇంట్లో బందీగా ఎందుకు ఉంది..కారణం ఏంటీ…

నారాయణపేట జిల్లా, మక్తల్ పట్టణంలోని యాదవ నగర్‌లో ఉంటున్న కురవ సురేష్ కూతురు అఖిల (7) ఇంటి బయటకు వెళ్లింది. ఓ దుకాణం వద్ద చాక్ లెట్ కొనుక్కొంది. ఇంటి పై అంతస్తుపై ఆడుకోవాలని అనుకుని వెళ్లింది. శ్రీనివాసరావుకు ఇంటి రేకులపైకి ఎక్కింది. ఇవి పలచగా ఉన్నాయి. ప్రమాదవశాత్తు అఖిల జారి ఇంట్లో పడిపోయింది. అఖిల ఎంత అరిచినా బయటకు వినిపించలేదు. కారణం వేసవి సెలవులు కావడంతో శ్రీనివాసరావు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిపోయాడు. ఎంత అరిచినా బయటి వారికి వినిపించలేదు. దీనితో నీళ్లు తాగుతూ..ప్రాణాలు కాపాడుకుంది అఖిల.

తమ బిడ్డ అఖిల కనిపించడం లేదని తెలుసుకున్న తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. ఫలితం కనిపించలేదు. పోలీసులకు కంప్లయింట్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో అఖిల కనిపించడం లేదంటూ పోస్టులు చేశారు. ఇంటికి వచ్చిన యజమాని శ్రీనివాసరావు తాళం తీసుకుని లోనికి వచ్చాడు. జీవచ్చంలా..శుష్కించుకపోయిన అఖిల కనిపించింది. వెంటనే అఖిల తల్లిదండ్రులకు తెలియచేశాడు. అఖిలను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మొత్తం మీద తప్పిపోయిన కూతురు ప్రాణాలతో తిరిగి రావడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.