కాంగ్రెస్‌కు చిత్తరంజన్ దాస్ గుడ్ బై
తెలంగాణలో కొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లోనైనా పరువు కాపాడుకోవాలని టిపిసిసి ఉంటే...నేతలు రాజీనామా లేఖలు సంధిస్తున్నారు.

తెలంగాణలో కొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లోనైనా పరువు కాపాడుకోవాలని టిపిసిసి ఉంటే…నేతలు రాజీనామా లేఖలు సంధిస్తున్నారు.
తెలంగాణలో కొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లోనైనా పరువు కాపాడుకోవాలని టిపిసిసి ఉంటే…నేతలు రాజీనామా లేఖలు సంధిస్తున్నారు. దీనితో టి.కాంగ్రెస్‌కి ఏం చేయాలో పాలుపోవడం లేదు. మార్చి 22వ తేదీన శుక్రవారం ఏకంగా ఇద్దరు సీనియర్ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఒకరు మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ కాగా మరొకరు సీనియర్ నేత, కాంగ్రెస్ ఓబీసీ సెల్ ఛైర్మన్, మాజీ మంత్రి చిత్త రంజన్ దాస్. తాను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు చిత్త రంజన్ దాస్ ప్రకటించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రాజీనామా లేఖను పంపించారు. ఈయన టీఆర్‌ఎస్‌లో చేరుతానని తెలుస్తోంది. సామాజిక న్యాయం లోపించిందని, సీనియర్ నాయకులకు గౌరవం లేదని చిత్త రంజన్ దాస్ తెలిపారు.
Read Also : చంద్రబాబు సరికొత్త స్లోగన్ : టీడీపీకి ఓటు వేస్తే గెలుపు ప్రజలదే అట
ఇక చిత్తరంజన్ దాస్ విషయానికి వస్తే…1985లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఈ నేత 1989లో కల్వకుర్తి నుండి ఎన్టీఆర్‌ని ఓడించి సంచలనం సృష్టించారు. రాష్ట్ర వ్యాప్తంగా చిత్తరంజన్ దాస్ పేరు మార్మోగిపోయింది. మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మంత్రివర్గంలో ఈయన పనిచేశారు. ఆ తర్వాత 1994లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుండి పార్టీ టికెట్ ఇవ్వలేదు. ముందస్తు ఎన్నికల్లో కొల్లాపూర్ లేదా జడ్చర్ల నుంచి పోటీ చేయాలని ప్రయత్నాలు చేసినా చిత్తరంజన్ దాస్‌కు కాంగ్రెస్ టికెట్ కేటాయించలేదు. తాజా పరిణామాలతో కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో ?
Read Also : వాళ్లు అలా : జగన్ ఫ్యామిలీ ఆస్తులు ఇలా..