చెలరేగిన గేల్…గ్రౌండ్ లో బౌండరీల వర్షం

ఐపీఎల్ లో భాగంగా జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరుగుతున్న నాల్గవ లీగ్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓపెనర్ క్రిస్ గేల్ చెలరేగిపోయాడు. రాజస్థాన్ బౌలర్లకు గేల్ చుక్కలు చూపించాడు. గ్రౌండ్ లో బౌండరీల వర్షం కురిపించాడు.నాలుగు సిక్స్ లు,ఎనిమిది ఫోర్లతో చెలరేగిపోయాడు.47 బంతులు ఆడిన గేల్ 79 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.స్టోక్స్ వేసిన 16వ ఓవర్లో మొదటి నాలుగు బంతులనూ బౌండరీకి తరలించిన గేల్.. ఐదో బంతికి బౌండరీ లైన్ వద్ద త్రిపాఠికి క్యాచ్ ఇచ్చాడు.