పద్దు సిద్ధం : ఏపీ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం

అమరావతి : ఏపీ అసెంబ్లీలో ఫిబ్రవరి 5న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. బడ్జెట్ సుమారు రూ.2.26లక్షల కోట్ల మేర ఉండే అవకాశముంది. ఉదయం 11.45 గంటలకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
ఓట్ ఆన్ అకౌంట్‌గా ప్రభుత్వం పేర్కొంటున్నా పూర్తి స్థాయి సంసిద్ధతతో, రాష్ట్ర ప్రజానీకాన్ని ఆకట్టుకునేలా బడ్జెట్ ఉంటుందని మంత్రి యనమల తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పథకాలతో పాటు మరికొన్ని కొత్త వరాలు ఈ బడ్జెట్‌లో ప్రకటించబోతున్నారు. సాగునీటి, వ్యవసాయ రంగాల కేటాయింపులు పెంచనున్నారు. రైతులు, మహిళలు, పేదలు, యువత, నిరుద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ప్రాధామ్యాలుగా ఈ బడ్జెట్‌లో చూపనున్నారు. రాజధాని నిర్మాణానికీ పెద్దపీట వేయనున్నారు.