మోడీ అన్నిరంగాల్లో విఫలం : సీఎం చంద్రబాబు

  • Published By: veegamteam ,Published On : January 5, 2019 / 10:24 AM IST
మోడీ అన్నిరంగాల్లో విఫలం : సీఎం చంద్రబాబు

Updated On : January 5, 2019 / 10:24 AM IST

శ్రీకాకుళం : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్ని రంగాల్లో విఫలమయ్యారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. ప్రధాని నమ్మించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగిరిలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురికి చంద్రబాబు ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని తెలిపారు. 

రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్నామన్నారు. రూ.83 వేల కోట్లతో 30 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. రూ.24 వేల కోట్లు రైతు రుణమాఫీ చేశామని పేర్కొన్నారు. సంక్రాంతి తర్వాత మిగిలిన రుణాన్ని మాఫీ చేస్తామని వెల్లడించారు. వ్యవసాయంలో మంచి అభివృద్ధి సాధించామన్నారు. ప్రకృతి సేద్యంలో అవార్డు వచ్చిందని చెప్పారు.