వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
కర్నూలు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలించారు.

కర్నూలు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలించారు.
కర్నూలు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలించారు. అనంతరం సహాయ, పునరావాస చర్యలపై మున్సిపల్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఆళ్లగడ్డ, నంద్యాల, మహానంది ప్రాంతాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. వరదలతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
నంద్యాల డివిజన్ లో 17 మండలాల్లో వర్షం అధికంగా పడి 724 కోట్లు, ఆర్ అండ్ బీకి సంబంధించి 422 కోట్లు, 31 వేల హెక్టార్లలో పంట, 2 వేల హెక్టార్లలో ఉద్యాన పంట నష్టం వాటినట్లు అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకుంటామన్నారు. వారికి రెగ్యులర్ గా ఇచ్చే సహాయం కన్నా ప్రతి ఇంటికి అదనంగా రూ.2 వేలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ను ఆదేశించారు సీఎం జగన్. ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు నింపేలా అధికారులు మానవత్వంతో పని చేసి వరద బాధితులను ఆదుకోవాలన్నారు. వరద బాధితులకు ఇల్లు నిర్మించే విధంగా భరోసా ఇచ్చారు సీఎం జగన్.
ఇంచార్జ్ మంత్రి అక్కడే ఉంటూ సహాయక చర్యలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. రాయలసీమ ప్రాంతాల్లో ఉన్న వరద జలాలతో జిల్లాలో ఉన్న ప్రతి డ్యామ్ ను నింపుతామని సీఎం జగన్ చెప్పారు. కృష్ణా ఆయకట్టుతో రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ తో మాట్లాడి గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం చేసేందుకు చర్యలు చేపట్టబోతున్నట్లు తెలిపారు.