అమరావతిలో రాజధాని నిర్మాణం కష్టం : సీఎం జగన్
నవ్యాంధ్ర రాజధాని అమరావతి వ్యవహారంపై సీఎం జగన్ మరోసారి స్పందించారు. అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతం కాకూడదన్నారు.

నవ్యాంధ్ర రాజధాని అమరావతి వ్యవహారంపై సీఎం జగన్ మరోసారి స్పందించారు. అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతం కాకూడదన్నారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి వ్యవహారంపై సీఎం జగన్ మరోసారి స్పందించారు. అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతం కాకూడదన్నారు. విజయవాడలో జరిగిన ‘ది హిందూ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్’ కార్యక్రమానికి ఆయన హాజరై, రాజధాని ప్రస్తావన తెచ్చారు. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని మరోసారి ఆయన స్పష్టం చేశారు. అమరావతిలో కూడా అభివృద్ధి కొనసాగుతుందన్నారు.
తాను మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. భావితరాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర యువత ఉద్యోగాల కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లకుండా వైజాగ్ ను అభివృద్ధి చేస్తామన్నారు. అమరావతిలో శాసన రాజధాని, విశాఖలో కార్యనిర్వహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఉంటాయని చెప్పారు.
ముఖ్యమంత్రికి అధికారాలు, బాధ్యతలుంటాయని తెలిపారు. ఒక సీఎంగా తాను నిర్ణయం తీసుకోకుంటే దాని ప్రభావం భవిష్యత్ తరాలపై పడుతుందన్నారు. ప్రస్తుతం రాజధానిగా చెబుతున్న ప్రాంతంలో సరైన రోడ్లు కూడా లేవన్నారు. మౌలిక సదుపాయాలు కల్పనకు రూ.లక్షా 9 వేల కోట్లు అవసరం అని తెలిపారు. ఇంత ఖర్చుతో అమరావతిలో రాజధాని నిర్మాణం కష్టం అని స్పష్టం చేశారు.
విశాఖ అభివృద్ధి చెందిన నగరం…మౌలిక వసతులన్నీ ఉన్నాయన్నారు. అమరావతిలో ఖర్చు చేసే డబ్బులో 10 శాతం విశాఖలో ఖర్చు చేస్తే పదేళ్లలో హైదరాబాద్, బెంగళూరుతో విశాఖ పోటీపడుతుందన్నారు. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్ కొనసాగుతుందన్నారు.