విశాఖకు సీఎం జగన్ : రూ.1300 కోట్లతో చేపట్టే అభివృద్ది పనులకు శంకుస్థాపన

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇవాళ(డిసెంబర్ 13,2019) విశాఖ జిల్లాకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం మూడున్నర తర్వాత ఆయన విశాఖలో పర్యటించనున్నారు. 1300 కోట్లతో

  • Published By: veegamteam ,Published On : December 13, 2019 / 02:11 AM IST
విశాఖకు సీఎం జగన్ : రూ.1300 కోట్లతో చేపట్టే అభివృద్ది పనులకు శంకుస్థాపన

Updated On : December 13, 2019 / 2:11 AM IST

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇవాళ(డిసెంబర్ 13,2019) విశాఖ జిల్లాకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం మూడున్నర తర్వాత ఆయన విశాఖలో పర్యటించనున్నారు. 1300 కోట్లతో

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇవాళ(డిసెంబర్ 13,2019) విశాఖ జిల్లాకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం మూడున్నర తర్వాత ఆయన విశాఖలో పర్యటించనున్నారు. 1300 కోట్లతో నిర్మించనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళంలోనూ ఆయన పాల్గొననున్నారు. సీఎం పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ పరిధిలో సుమారు 1300 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. వివిధ విభాగాలకు చెందిన 24 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అమృత పథకం కింద 40వేల హౌస్‌ సర్వీస్‌ కనెక్షన్లను సీఎం చేతుల మీదుగా అందజేయనున్నారు. ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన ఆర్కే బీచ్‌ను మెరుగుపరిచే పనులకు జగన్‌ శ్రీకారం చుట్టనున్నారు. ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ సాయంతో చేపట్టిన ముడసర్లోవ రిజర్వాయర్‌లో శాశ్వత ప్రాతిపదికన పూడికతీత తీసే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు.

ఇక ఏయూలో జరిగే పూర్వ విద్యార్థుల సమ్మేళ్లనానికి సీఎం జగన్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఏయూ పూర్వ విద్యార్థులు చాన్నాళ్ల తర్వాత సమ్మేళనం నిర్వహిస్తున్నారు. దీనికి సీఎంను ఆహ్వానించారు. దీంతో పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో జగన్ పాల్గొననున్నారు. అయితే సీఎం రాకతో యూనివర్శిటీ అధికారులో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. యూనివర్శిటీకి సీఎం ఏ వరాలు ప్రకటిస్తారోనన్న చర్చసాగుతోంది. వర్శిటీ అభివృద్ధికి అవసరమైన పలు నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో కొన్నింటికి సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినా… యూనివర్సిటీ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని పాలకవర్గాలు భావిస్తున్నాయి.

సీఎం పర్యటన కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్‌, ఎస్పీ సీఎం పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.