ఢిల్లీకి సీఎం జగన్

  • Published By: vamsi ,Published On : February 11, 2020 / 11:08 AM IST
ఢిల్లీకి సీఎం జగన్

Updated On : February 11, 2020 / 11:08 AM IST

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం(12 ఫిబ్రవరి 2020)న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాను ముఖ్యమంత్రి జగన్ కలవనున్నారు.

బుధవారం సాయంత్రం ప్రధాని మోడీతో సీఎం భేటీ అవుతారని తెలుస్తుంది. ఈ భేటీలో రాజధాని అమరావతి అంశం సహా శాసన మండలి రద్దు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ మేరకు సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి.

అలాగే ఇటీవల దిశా చట్టం నిర్ణయం తీసుకుంది ఏపీ అసెంబ్లీ. అయితే ఈ చట్టంలో మార్పులు గురించి ఇప్పటికే కేంద్రం కొన్ని సూచనలు చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి దీని గురించి న్యాయపరంగా కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.