కోళ్ల ఫామ్స్ గా మారిపోతున్న స్కూల్స్..ప్లే గ్రౌండ్స్ లో కూరగాయల పంట

  • Published By: nagamani ,Published On : August 28, 2020 / 03:20 PM IST
కోళ్ల ఫామ్స్ గా మారిపోతున్న స్కూల్స్..ప్లే గ్రౌండ్స్ లో కూరగాయల పంట

Updated On : August 28, 2020 / 4:03 PM IST

కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచంలోని చాలా దేశాల్లో స్కూల్స్ అన్నీ మూతపడ్డాయి. అమెరికాలో రెండు వారాల క్రితం కొన్ని రాష్ట్రాల్లో స్కూల్స్ రీఓపెన్ చేయగా మరోసారి కరోనా తన ప్రతాపాన్ని చూపెట్టింది. ఈ క్రమంలో భారత్ సెప్టెంబర్ 1 నుంచి స్కూల్స్ రీఓపెన్ చేద్దామనే ఆలోచనలో ఉంది. కానీ కరోనా ఉదృతి నేపథ్యంలో ఆఫ్రికా ఖండంలోని కెన్యా మాత్రం జనవరి 2021 వరకూ స్కూల్స్ రీఓపెన్ చేయకూడదని నిర్ణయించింది. దీంతో చాలా ప్రైవేటు స్కూళ్ల మనుగడ కష్టమవుతోంది.



ఒకప్పుడు విద్యార్థుల ఆటపాటలతో …అల్లరితో మారు మ్రోగిన స్కూల్స్ కోళ్ల ఫారమ్ లా మారిపోతున్నాయి. అటువంటిదే మువేయా బ్రెథ్రెన్ స్కూల్ క్లాస్‌రూముల్లో కోడి పిల్లల కొక్కొరొకో శబ్దాలు వినిపిస్తున్నాయి. క్లాసు రూముల్లో మాస్టార్లు బ్లాక్‌బోర్డుపై మ్యాథ్స్ కు బదులు కోళ్లకు వేయాల్సిన వ్యాక్సీన్ షెడ్యూల్ కనిపిస్తోంది.



సెంట్రల్ కెన్యాలోని జోసెఫ్ మైనా ఓ స్కూల్ నడుపుతున్నారు. కరోనా వ్యాప్తి క్రమంలో స్కూళ్లు మూతపడటంతో ఆదాయం లేకపోవటంతో స్కూల్ క్లాసురూముల్లో కోళ్లను పెంచుకొనేందుకు రెంట్ కు ఇచ్చేశారు.

మార్చిలో స్కూల్స్ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటంతో పరిస్థితి మరింత దిగజారిపోయింది. గతంతో బ్యాంకు నుంచి తీసుకున్న లోన్లు చెల్లించటానికి డబ్బుల్లేక గడువు కోరారు. కానీ గడువులోపు లోను కట్టేందుకు డబ్బులు చేతికందే పరిస్థితి లేదు. కరోనా కష్టంతో ఏంచేయాలో పాలుపోలేదు. కానీ బతకటానికి ఏదొకటి చేయాలిగా అనుకున్నారు జోసెఫ్.దీంతో స్కూల్ ను కోళ్ల ఫామ్స్ కోసం అద్దెకు ఇచ్చేయాల్సి వచ్చింది. విద్యార్ధులు కూర్చుకునే బెంచీలు..డెస్క్ లు అన్నీ ఓ పక్కకు సర్ధించేసి క్లాసు రూముల్లో కోళ్లను పెంచుతున్నారు.

Corona effect: borno classroom transformed into a poultry farm as schools remain closed



కెన్యాలో 20 శాతం మంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో చదువుకుంటున్నారు. ఈ స్కూళ్లకు విద్యార్దులు కట్టే ఫీజులే ఆధారం. లాక్‌డౌన్‌తో స్కూల్స్ మూతపడటంతో సిబ్బందికి జీతాలు చెల్లించలేక చాలా స్కూళ్లు చేతులెత్తేశాయి. దాదాపు చాలా వరకూ మూతపడ్డాయి. కానీ కొన్ని స్కూళ్లు మాత్రం ఆన్‌లైన్ బోధనతో ఎలాగోలా నెట్టుకొస్తున్నాయి. పిల్లలు చెల్లించే ఫీజులు టీచర్ల జీతాలకే సరిపోతున్నాయని..తమకు ఒక్క రూపాయి కూడా మిగలట్లేదని కెన్యా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ (కేపీఎస్‌ఏ) వాపోయింది.

మూడు లక్షల వరకూ ప్రైవేటు స్కూల్ సిబ్బంది ఉన్నారు. వీరిలో 95 శాతం మందికి జీతాలు ఇవ్వకుండా సెలవులపై వెళ్లాలని సూచించినట్లు కేపీఎస్‌ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీటర్ ఎన్‌డోరో తెలిపారు. దీంతో 133 స్కూళ్లు అయితే శాశ్వతంగా మూతపడ్డాయి.





క్లాస్ రూమ్‌లో కోళ్లకు మేత వేసే మొక్కజొన్నల స్టాక్ పెట్టే స్టోర్ రూముల్లా మారిపోయాయి. సెంట్రల్ కెన్యాలోని రోకా ప్రిపరేటరీ స్కూల్‌ను మూసివేయకుండా తాత్కాలిక కోళ్ల పరిశ్రమలా మార్చేశారు. దీని గురించి ఈ స్కూల్ ఫౌండర్ జేమ్స్ కుంగు మాట్లాడుతూ…ఈ స్కూల్ ను 23 ఏళ్ల క్రితం ప్రారంభించాను..ఇప్పటి వరకూ ఇటువంటి పరిస్థితులుచూడలేదని వాపోయారు.ఒకప్పుడు పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్‌లో నేడు కూరగాయలు పండిస్తున్నామని తెలిపారు.

 

ఇప్పుడిక్క విద్యార్థుల అల్లరి లేదు..టీచర్ల మందలింపులు లేవు..కారులో డీజిల్ కొట్టించుకోవటానికి డబ్బులు లేవు..ఇటువంటి దుర్భర పరిస్థితులకు ఎప్పుడూ చూడలేదు..దీంతో మేం మానసికంగా చాలా బాధపడుతున్నామని ఆవేదనగా చెప్పారు జేమ్స్.

ఈ కోళ్ల పరిశ్రమ కేవలం డబ్బులు సంపాదించడానికి మాత్రమే కాదు..మేం ఉంటున్నాం. ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నాం..ఖాళీ నుంచి తప్పించుకోవటానికి ఇదొక సాధనంలా ఉంది తప్ప మరొకటి కాదన్నారు..



కొంత మంది టీచర్లు ఫోన్‌చేసి చేసేందుకు ఏదైనా పనుందా? అని అడుగుతున్నారు..వాళ్లలా అడుగుతుంటే చాలా బాధేస్తోంది కానీ మేం మాత్రం ఏం చేయగలం..మేం తినడానికే లేదు.. జోసెఫ్ మైనా స్కూల్ ఫౌండర్ జోసెఫ్ అన్నారు.ప్రైవేటు స్కూల్ టీచర్లు కూడా ఆదాయం కోసం వేరే వృత్తుల బాట పడుతున్నారు.

కెన్యా రాజధాని నైరోబీలో ఆరేళ్ల నుంచీ ఓ ప్రైవేటు స్కూల్‌లో పాఠాలు చెప్పిన మెర్సీన్ ఒటీనో.. అనే ఓ టీచర్ ప్రస్తుతం ఇంటి అద్దె కూడా కట్టుకోలేని దుస్థితిలో ఉన్నారనీ..దీంతో ఆమె ఇల్లును ఖాళీ చేసి..ప్రస్తుతం ఆమె ఓ పిల్లాడి ఆలనాపాలనా చూసే ఆయాగా ఓ ఇంటిలో ఉండాల్సి వస్తోందన్నారు.



కెన్యాలో ఒక కోవిడ్-19 కేసు బయటపడిన వెంటనే.. స్కూళ్లన్నీ మూసివేశారు. మాకు చేయడానికి ఎలాంటి పనీ లేకుండా పోయిందనీ..నా కొడుకుకు కడుపునిండా తినటానికి తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందనీ..కానీ బిడ్డను బతికించుకోవటానికి ఏదో ఒకటి పెట్టాలని చాలా ప్రయత్నించాను…ఆ పరిస్థితి ఏ తల్లికీ రాకూడదని మెర్సీన్ ఒటీనో టీచర్ కన్నీటితో తెలిపారు.

తూర్పు కెన్యాలో టీచర్‌గా పనిచేసిన గ్లోరియా మాట్లాడుతూ..ఇక స్కూల్ టీచర్ గా మారను..ఏదోక చిన్న వ్యాపారం చేసుకుంటాను..సరకులు అమ్మే చిన్నపాటి బిజినెస్ పెట్టుకోవటానికి చిన్న లోన్ తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే..అసలు ప్రైవేటు స్కూళ్లు మళ్లీ తెరచుకుంటాయా? అనే ప్రశ్నలు రావటంతో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.



ప్రైవేటు స్కూళ్లకు ప్రభుత్వం సాయం చేయాలి. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థలో అవి కూడా భాగమేకదా…ప్రభుత్వ సాయం చేయకపోతే.. చాలా స్కూళ్లు మూతపడే పరిస్థితి వస్తుందని పీటర్ అనే ఓ విద్యావేత్త అన్నారు. ఇలా దేశంలో చాలా ప్రైవేటు స్కూళ్ల పరిస్తితి ఉందని..ప్రభుత్వం వాటిని ఆదుకోకపోతే అవి శాశ్వతంగా మూత పడే ప్రమాదం ఉందనీ..అవి మూత పడితే ప్రభుత్వానికి ఆదాయం కూడా తగ్గిపోతుందని అన్నారు.అది మళ్లీ ప్రజలమీదే భారం పడుతుందని కాట్టి ప్రైవేటు స్కూళ్లను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

ఇలా కెన్యాలోని చాలా స్కూళ్లు వివిధ పరిశ్రమలుగా మారిపోతున్నాయి. ఈ కరోనా కష్టాలు ఎప్పటికి తీరతాయో తెలీదు..తీరిని ఎప్పటికి ఆ నష్టాల్లోంచి బైటపడతారో తెలీదు. అసలు తిరిగి స్కూళ్లకు పాత వైభవం వస్తుందా? లేదా అనే అనుమానం వెల్లడవుతోంది.