గ్రామాల్లో వస్తుమార్పిడి..టీచర్లకు బియ్యం..కూరగాయలు..సరుకులు

  • Published By: nagamani ,Published On : September 1, 2020 / 12:58 PM IST
గ్రామాల్లో వస్తుమార్పిడి..టీచర్లకు బియ్యం..కూరగాయలు..సరుకులు

Updated On : September 1, 2020 / 2:05 PM IST

కరోనా వైరస్ జీవితాలను తల్లక్రిందులు చేసేయటమేకాదు..పాత పద్ధతుల్ని..గుర్తుకుతెస్తోంది. పాతకాలం అని కొట్టిపడేసిన అలవాట్లను..పద్ధతులను..మరోసారి అలవాటు చేసుకోండిరా..అని చెబుతోంది. నీకున్నది నాకు..నాకున్నది నీకు ఇచ్చుకుందాం..కలిసి బతుకుదాం..అని నేర్పిస్తోంది. అదే ‘వస్తుమార్పిడి’పద్ధతి.



పూర్వకాలంలో వస్తు మార్పిడి పద్ధతి ఉండేదని పుస్తకాల్లో చదువుకున్నాం. లేదా అమ్మమ్మలు నాయనమ్మలు చెప్పిన మాటలు విని ఉంటాం. అది మరోసారి ఈ కరోనా కాలంలో పుస్తకాల్లో చదువుకున్నదాన్ని అమలు చేస్తోంది. ‘వస్తు మార్పిడి’ అంటే..మీకు కావాల్సిన వస్తువు తీసుకుని, మరో వస్తువును వాళ్లకు ఇవ్వడమన్న మాట.

కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు కొన్ని గ్రామాల్లో ఆ పూర్వకాలం నాటి పద్ధతినే పాటిస్తున్నారు. తమ పిల్లలకు పాఠాలు చెప్పినందుకు టీచర్లకు డబ్బులివ్వకుండా కూరగాయలు, బియ్యం ఇస్తున్నారని ఓ సర్వేలోవెల్లడైంది.



కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రవేశపెట్టిన ఆంక్షలతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా 191 దేశాల్లో 157 కోట్ల మంది విద్యార్ధులు తీవ్రంగా న‌ష్ట‌పోయార‌ని యునెస్కో వెల్ల‌డించింది. ప్ర‌పంచంలోని మొత్తం విద్యార్ధుల్లో 91 శాతం మంది మీద క‌రోనా వైర‌స్ తీవ్ర ప్ర‌తికూల ప్ర‌భావం చూపిందనీ.. భార‌త‌దేశంలో అయితే 32 కోట్ల మంది విద్యార్ధులుగా ఉన్న చిన్నారులపై ప్రభావం పడిందని యునెస్కో చెబుతోంది. సిటీల్లోని చాలా వరకూ స్కూల్స్ ఇప్పటికే ఆన్‌లైన్ బాట పట్టి కిందా మీదా పడి నడిపిస్తున్నాయి. కానీ గ్రామాల్లో పరిస్థితి మరోలా ఉంది. అందుకే గ్రామాల్లో వస్తు మార్పిడి పద్ధతిలో పాఠాలు చెబుతున్న పరిస్థితి ఉంది.

2020 మార్చి నుంచి మే మధ్య కాలంలో 70శాతం గ్రామీణ ప్రజల నెలవారి ఆదాయం తగ్గిపోయిందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. కరోనా ప్రభావంతో తగ్గిన ఉపాధి..పెరుగుతున్న ఆర్థిక ఇబ్బందులు, విద్యార్థుల్లో ఉన్న డిజిటల్ అసమానతలను ఈ వస్తు మార్పిడి విధానం మరోసారి వచ్చింది.



రూపాయిలు, కాసులు, నాణేలు లేని రోజుల్లో వస్తు మార్పిడి విధానం ఉండేది..చరిత్రలో కొన్ని శతాబ్దాల క్రితం ఒకరి వద్ద ఉన్న వస్తువులు వేరొకరికి ఇచ్చిన తమకు అవసరం అయిన వాటిని తీసుకునేవారని చరిత్ర చెబుతోంది.మళ్ళీ ఆ చరిత్రను తిరగరాసే రోజులు వచ్చాయి ప్రస్తుత కరోనా కాలంలో.. పెద్ద పని ఉంటేనేగానీ..బైటకు రాలేకపోతున్నారు. ఉపాధిలో కోత..వచ్చేవచ్చే డబ్బుల్లో కోత. చేతిలో డబ్బులే కనిపించటంలేదు..దాంతో పలు ప్రాంతాలలో ప్రజలు మళ్లీ ‘వస్తు మార్పిడి’ విధానానికి అలవాటు పడుతున్నారు. విశాఖలోని శివారు గ్రామాల్లో కూడా ఇటువంటి పద్ధతి పాటిస్తున్నారు గ్రామస్తులు.
https://10tv.in/sbi-upi-fund-transfer-failure-what-to-do-if-amount-is-debited-from-account-on-yono-lite-app/
విశాఖ శివారు ప్రాంతమైన చినగదిలిలో వస్తువులను ఇచ్చి పుచ్చుకుంటూ స్థానికులు తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. తమ దగ్గర ఉన్న వాటిని ఇతరులకు పంచడం, వారి వద్ద ఉన్న సరుకులు తాము తీసుకోవడం ద్వారా ఈ ఆపత్కాలాన్ని గట్టెక్కుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. అలాగే స్కూల్ టీచర్లకు ఫీజులకు బదులుగా..బియ్యం..కూరగాయలు ఇస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో..



ఎకౌంటులో డబ్బులు లేక ఏటీఎంలు వెక్కిరిస్తున్నాయి. మరో వైపు కరెన్సీ ద్వారా కూడా కరోనా అంటువ్యాధిలా సోకుతుందని తెలుస్తోంది.దీంతో వస్తు మార్పిడి ద్వారా నిత్యావసరాలకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నామని అంటున్నారు. మొత్తం మీద ఇదేదో బాగున్నట్లుగానే ఉందిపుడు.

దీన్ని మిగిలిన ప్రాంతలా వారు కూడా ఆచరించేందుకు ముందుకువస్తున్నారు. అంటే మళ్ళీ మనం పురాతన రోజులను గుర్తు చేసుకోవాల్సిందే. పైగా ఈ ఇచ్చిపుచ్చుకోవడంలో ఎంతో ఆనందం, ఆప్యాయత కూడా ఉందని అంటున్నారు.