జలుబు, దగ్గు ఉంటే తిరుమలకు రావద్దు : శ్రీవారి దర్శనానికి ఆంక్షలు

  • Published By: veegamteam ,Published On : March 9, 2020 / 03:45 AM IST
జలుబు, దగ్గు ఉంటే తిరుమలకు రావద్దు : శ్రీవారి దర్శనానికి ఆంక్షలు

Updated On : March 9, 2020 / 3:45 AM IST

జలుబు,దగ్గు,జ్వరం ఉన్నవాళ్లు తిరుమల శ్రీవారి దర్శనానికి రావద్దని టీటీడీ అధికారులు భక్తులను కోరారు.  భారీ సంఖ్యలో తిరుమల వెంకన్నను దర్శించుకోవటానికి భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో కరోనా వైరస్ ప్రభావం తిరుమల వెంకన్నపై కూడా పడింది.కరోనా లక్షణాలు (జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు )ఉన్నవారు దయచేసి తిరుమలకు రావద్దంటూ అధికారులు భక్తులను కోరుతున్నారు. 

చైనాలో పుట్టని కరోనా పలు దేశాలకు వ్యాపించింది. అలాగే ఇండియాలో కూడా కరోనా కలకలం సృష్టిస్తోంది. దేశంలో ఆరేడు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీల్లో కూడా కరోనా వైరస్ ప్రబలుతున్న క్రమంలో  తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తిరుమలలోని శ్రీవారి దర్శనంపై ఆంక్షలు విధించారు. కరోనా వైరస్ లక్షణాలైన జలుబు, దగ్గు ఉన్న భక్తులు తిరుమలలోని శ్రీవారి దర్శనానికి రావద్దని టీటీడీ అధికారులు సలహా ఇచ్చారు. 

కరోనా వైరస్ విస్తరిస్తున్న దృష్ట్యా జలుబు, దగ్గు ఉన్న భక్తులకు దర్శన భాగ్యం కల్పించకుండానే వెనక్కి పంపించాలని టీటీడీ అధికారి సిబ్బందిని ఆదేశించారు. తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ వల్ల కరోనా వైరస్ సులభంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందువల్ల జలుబు, దగ్గు, జ్వరం ఉన్న భక్తులు తమ తిరుమల పర్యటనను వాయిదా వేసుకోవాలని ఆలయ అధికారులు కోరారు. 

కరోనావైరస్ లక్షణాలు భక్తుల్లో ఎవరికైనా కనిపిస్తే వెంటనే వారిని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) కు తరలించాలని ఆలయ అధికారులు ఆదేశించారు. కరోనా వైరస్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యగా భక్తులు సానిటైజర్, మాస్కులు వెంట తీసుకురావాలని టీటీడీ అధికారులు సూచించారు.

See Also | జపాన్‌లో గోమూత్రం బంగారం.. కోట్లలో ఆదాయం తెచ్చిపెడుతోంది!