అక్షయ తృతీయ తిరుమల ఆఫర్ : శ్రీవారి డాలర్లు విక్రయం

  • Published By: vamsi ,Published On : May 6, 2019 / 04:15 AM IST
అక్షయ తృతీయ తిరుమల ఆఫర్ : శ్రీవారి డాలర్లు విక్రయం

Updated On : May 6, 2019 / 4:15 AM IST

అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా శ్రీవారి డాలర్ల విక్రయానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తుంది. మే నెల 7వ తేదీ(మంగళవారం)న అక్షయ తృతీయ అవడంతో ఆ రోజునే డాలర్లను అమ్మాలని టీటీడీ భావిస్తుంది. అక్షయతృతియ నాడు పసిడి, వెండి కొంటే మరింత సంపద వస్తుందనేది ప్రజల నమ్మకం. అందులోనూ శ్రీవారి డాలర్లు కొనుగోలు చేసి ధరిస్తే మరింత శుభంగా, స్వామివారి ఆశీస్సులు పొందవచ్చని భక్తులు భావిస్తుంటారు. దీంతో ఆంధ్రాబ్యాంకు ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం ఎదుట డాలర్ల నిల్వలను టీటీడీ బోర్డు అమ్మకానికి పెట్టింది.

ఖరారు చేసిన డాలర్ల ధరల వివరాలు:
బంగారం (10గ్రా)  : 32,178రూ.
బంగారం (5గ్రా)    : 16,311రూ.
బంగారం (2గ్రా)    : 6,754రూ.
వెండి(10గ్రా)        : 593రూ.
వెండి(5గ్రా)          : 320రూ.
రాగి (10గ్రా)         :26రూ. 
రాగి (5గ్రా)           : 20రూ.