ఏపీలో ఆ  రెండు స్థానాల ఎన్నికలు రద్దు చేయాలి

  • Published By: vamsi ,Published On : April 22, 2019 / 04:30 PM IST
ఏపీలో ఆ  రెండు స్థానాల ఎన్నికలు రద్దు చేయాలి

Updated On : April 22, 2019 / 4:30 PM IST

ఎన్నికల్లో ఖర్చు ఎక్కువ అవుతుందంటూ అనంతపురం ఎంపీ జేసీ ధివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నేత రామకృష్ణ ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేశారు. అనంతపురం పార్లమెంట్, తాడిపత్రి అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసిన ఆయన ఈ మేరకు లేఖను ఎన్నికల కమీషనర్‌కు అందజేశారు.

కుమారుల కోసం రూ.50 కోట్లు ఖర్చుపెట్టానని జేసీ అన్నారని గుర్తు చేశారు. ఓటుకు రూ.2 వేలు పంచామని చెప్పారని. కోట్లు వెదజల్లడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. 30 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు, జేసీ లాంటివారు డబ్బు కోసం రాజకీయాలను దిగజార్చారని జేసీ వ్యాఖ్యల్ని సుమోటోగా స్వీకరించి ఎన్నికను రద్దు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.